రామ్ కి కలిసొచ్చే కాలం

  • IndiaGlitz, [Thursday,October 01 2015]

జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే అంద‌రూ రామ్‌కి క‌లిసొచ్చే కాలం మొద‌లైంద‌నే అంటున్నారు. అక్టోబ‌ర్ 2న రామ్ న‌టించిన శివ‌మ్‌తో పాటు వ‌రుణ్ తేజ్ సినిమా కంచె కూడా విడుద‌ల‌వుతుందని ముందు టాక్‌. రామ్ వ‌ర్సెస్ మెగా పోటీ ఉంటుంద‌ని కూడా అనుకున్నారు. కానీ అనూహ్య‌రీతిలో కంచె పోటీ నుంచి త‌ప్పుకుంది. దాంతో రామ్ అక్టోబ‌ర్ 2న సోలో రిలీజ్‌కి సిద్ధ‌మ‌య్యారు.

కానీ అక్టోబ‌ర్ 1న పులి విడుద‌ల కానుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. సోషియో, ఫాంట‌సీ అడ్వంచ‌ర‌స్ సినిమా కావ‌డం, ఇందులో శ్రీదేవి న‌టించ‌డంతో కాస్త హైప్ ఉన్న మాట నిజ‌మే. కానీ ఆ ఆసినిమా తెలుగులో విడుద‌ల కాలేదు. సో రెండు, మూడు సినిమాల మ‌ధ్య ఉంటుంద‌నుకున్న శివ‌మ్ సినిమా ఈ వారం సోలో రిలీజ్‌గా పేరు తెచ్చుకుంది. క‌లిసొచ్చే కాలం అంటే ఇలాగే ఉంటుంద‌ని అంటున్నారు సినీ జ‌నాలు. మ‌రోవైపు రామ్ కూడా త‌న సినిమాను అగ్రెసివ్ గా ప్ర‌మోట్ చేసుకుంటున్నారు.