ఇష్టపడి చేసిన సినిమా 'స్కైలాబ్'.... అందరూ కనెక్ట్ అవుతారు - నిత్యామీనన్
Send us your feedback to audioarticles@vaarta.com
స్కైలాబ్ గురించి ఎవరిని అడిగినా చాలా కథలు చెబుతున్నారు. ఈ జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ఆ జనరేషన్‌కీ, ఈ జనరేషన్‌కీ కూడా కనెక్ట్ అవుతుంది. నిర్మాతగా హ్యాపీగా ఉన్నా అని 'స్కైలాబ్' గురించి చెప్పారు నిత్యామీనన్. ఆమెతో స్పెషల్ ఇంటర్వ్యూ...
ఈ సినిమాకు మిమ్మల్ని ప్రొడ్యూసర్ చేసిన పాయింట్ ఏంటి?
ఇలాంటి స్క్రిప్ట్ వింటే ఎవరూ ఎగ్జయిట్ కాకుండా ఉండరు. అంత పొటెన్షియల్ ఉన్న స్క్రిప్ట్. స్కైలాబ్ ట్రీట్‌మెంట్ చాలా బాగా అనిపించింది. తెలుగు సినిమాకు అది చాలా కొత్తగా అనిపించింది. తెలంగాణలోని చిన్న గ్రామంలో జరిగే కథే. కానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది. సినిమాలో అలాంటి పారడాక్సికల్ ట్రీట్‌మెంట్ నాకు చాలా ఇష్టం. అది వినగానే వెంటనే ఒప్పేసుకున్నా. మంచి సినిమా తీయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. అలాంటి తరుణంలో నేను కూడా ప్రొడ్యూస్ చేస్తానని చెప్పా.
కథ వినగానే ప్రొడ్యూసర్‌గా మారాలనుకున్నారు?
కథ విన్నప్పుడు మాత్రం కచ్చితంగా ఇలాంటి సినిమా స్క్రీన్ మీదకు రావాలని అనుకున్నా. కానీ, కొన్ని ఇష్యూల వల్ల నేను అనుకోకుండా నిర్మాతగా మారాను.
లీడ్ రోల్ చేస్తూ, ప్రొడ్యూసర్‌గా హ్యాండిల్ చేయడం కష్టమనిపించిందా?
షూట్ టైమ్ అంతా పృథ్వి మేనేజ్ చేశాడు. షూట్ తర్వాత నేను మేనేజ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి నటించేటప్పుడు ఇబ్బంది రాలేదు.
విశ్వక్‌గారు పాత స్కైల్యాబ్ గురించి మెన్షన్ చేశారా?
నాకు స్కైల్యాబ్ గురించి తెలియదు. ఇంటికెళ్లి అమ్మానాన్నలను అడిగితే, దాని గురించి చాలా కథలు చెప్పారు. మరి ఇన్నాళ్లు ఎందుకు నాతో చెప్పలేదు అని అడిగా. అప్పుడనిపించింది నాకు.. మన జనరేషన్‌కి దీని గురించి ఏమీ తెలియదు. పాత జనరేషన్ వాళ్లకు తెలుసు. ఆ కనెక్ట్ ఉంటుంది. స్కైల్యాబ్ గురించి ఎవరిని అడిగినా వాళ్లకో కథ ఉంది. సో అందరూ కనెక్ట్ అవుతారనిపించింది.
సత్యదేవ్‌తో యాక్టింగ్, ఆయన పెర్ఫార్మెన్స్ గురించి చెప్పండి?
సత్య అండ్ రాహుల్‌తో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. ఈ సినిమా 3 కేరక్టర్ల గురించి. 3 లీడ్స్ ఉంటాయి. రాహుల్, సత్యకి... వాళ్లకి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. నాది సెపరేట్ ట్రాక్. వాళ్లతో యాక్ట్ చేయలేదు. అందుకే ఇంటరాక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు సినిమా చూస్తుంటే, వాళ్లిద్దరూ చాలా ఫ్యాబులెస్‌గా పెర్పార్మ్ చేశారు.
ప్యారడాక్స్ గురించి ఎక్స్ ప్లయిన్ చేయండి?
బండలింగం పల్లి అనే విలేజ్‌లో జరుగుతుంది సబ్జెక్ట్. కానీ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, కలర్ ప్యాలెట్స్, ప్రొడక్షన్ డిజైన్ పరంగా రిఫ్లెక్ట్ కాదు. ఇందులో రా లుక్ ఉండదు. వెరీ కలర్‌ఫుల్, పాలిష్డ్ లుక్, శాచురేటెడ్ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మొత్తం మేర్సిడోనియాలో 40-50 పీస్ ఆర్కెస్ట్రాతో సౌండ్ ట్రాక్ చేశాం. సౌండ్ ట్రాక్ అంతా వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్‌తో ఉంటుంది.
బడ్జెట్ కంట్రోల్‌లో పెట్టుకున్నారా? లేదా?
(నవ్వుతూ). ఈ సినిమాకు నేనైనా, పృథ్వి అయినా చిన్న విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు. ఇది ఆ కైండ్ ఆఫ్ సినిమా. మేం ఈ సినిమాతో డబ్బు పోగొట్టుకున్నా, ఆ పర్టిక్యులర్ సీన్ కోసం కాంప్రమైజ్ అయినా ఫర్వాలేదన్నట్టే ఫీలయ్యాం. సో ఇది ఆ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ సినిమా మాకు మోర్ ఇంపార్టెంట్ దేన్ మనీ.
తెలంగాణ యాసలో ఫస్ట్ టైమ్ చేశారా?
తెలంగాణ మాట్లాడా. అదీ సింక్ సౌండ్‌లో చేశా. థ్రూ అవుట్ సినిమా అలాగే చేశా. ఒక్క వర్డ్ కూడా కరెక్షన్ లేదు. డబ్బింగ్ అవసరం లేదన్నారు. ఈ సినిమా కోసం ట్రైనింగ్ అని కాదు కానీ, వినడం, చదవడం, ఆ యాక్సెంట్‌లో మాట్లాడుతున్నా. నాకు తెలంగాణ యాక్సెంట్ చాలా ఇష్టం.
చాలా అందంగా ఉంటుంది వినడానికి. వర్క్ చేశారా? ఈ కేరక్టర్ కోసం..?
నేను స్పాంటానియస్ కేరక్టర్. జర్నలిస్ట్ గా చేశా. ఇంటీరియర్స్ చాలా వరకు సెట్స్ లో చేశాం. తెలంగాణ విలేజెస్ చాలా బ్యూటీఫుల్‌గా ఉంటాయి. హైదరాబాద్ పరిసరాల్లో చాలా చేశాం.
ఈ కేరక్టర్ చాలెంజింగ్‌గా అనిపించిందా?
చాలెంజింగ్ ఏమీ కాదు. చాలా సరదాగా చేశా. నెరేషన్ వింటున్నప్పుడే నాకు తెలిసిపోతుంది. అందుకే కేరక్టర్‌లోకి వెళ్లడానికి టైమ్ తీసుకోను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments