టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా గమనించారా..? అందరూ విద్యావంతులే..

  • IndiaGlitz, [Saturday,February 24 2024]

తెలుగుదేశం-జనసేన ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. రెండు పార్టీలు కలిసి ప్రకటించిన 99 మంది అభ్యర్థుల్లో అందరూ గ్రాడ్యుయేట్స్ కావడం విశేషం. ఇందులో ఒక్కరు ఐఏఎస్ అధికారి కాగా.. ముగ్గురు వైద్యులు, ఇద్దరు పీహెచ్‌డీ డాక్టరేట్లు ఉన్నారు. ఇక మిగిలిన అభ్యర్థుల్లో 30 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, 63 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. అలాగే మొత్తం 99 మందిలో 13 మంది మహిళలకు చోటు దక్కడం గమనార్హం. అభ్యర్థుల ఎంపికలో యువతతో పాటు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

ఇక ఈసారి ఎన్నికల్లో యువతకు చోటు కలిపిస్తామని లోకేష్‌తో పాటు చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్లే యువతకు పెద్ద పీట వేశారు. వయసురీత్యా చూస్తే 45 ఏళ్ల లోపు వయసు ఉన్న 24 మందికి చోటు కల్పించారు. 46 నుంచి 60 ఏళ్ల లోపు వారు 55 మంది.. 61 నుంచి 70 ఏళ్ల లోపు అభ్యర్థులు 20 మంది ఉన్నారు. అంతేకాకుండా 24 మంది కొత్త వారికి ఈసారి పోటీ చేసే అవకాశం ఇచ్చారు.

తొలిసారి పోటీ చేసే అభ్యర్థుల జాబితా..

1. తొయ్యక జగదీశ్వరి- కురుపాం
2. విజయ్ బోనెల- పార్వతీపురం
3. కొండపల్లి శ్రీనివాస్ - గజపతినగరం
4. యనమల దివ్య - తుని
5. మహాసేన రాజేష్ - పి.గన్నవరం
6. ఆదిరెడ్డి వాసు - రాజమండ్రి సిటీ
7. బడేటి రాధాకృష్ణ - ఏలూరు
8. సొంగ రోషన్ - చింతలపూడి
9. కొలికళాపూడి శ్రీనివాస్ - తిరువూరు
10. వెనిగండ్ల రాము - గుడివాడ
11. వర్ల కుమార్ రాజా - పామర్రు
12. వేగేశ్న నరేంద్ర వర్మ - బాపట్ల
13. గూడూరి ఎరిక్షన్ బాబు - ఎర్రగొండపాలెం
14. కావ్యా కృష్ణ రెడ్డి - కావలి
15. నెలవల విజయశ్రీ - సూళ్లూరుపేట
16. కాకర్ల సురేష్ - ఉదయగిరి
17. మాధవీరెడ్డి - కడప
18. బొగ్గుల దస్తగిరి - కోడుమూరు
19. అమిరినేని సురేంద్ర బాబు - కల్యాణ దుర్గం
20. ఎం. ఈ సునీల్ కుమార్ - మడకశిర
21. సవిత - పెనుగొండ
22. జయచంద్ర రెడ్డి - తంబల్లపల్లి
23. వీఎం థామస్ - జీడీ నెల్లూరు
24. గురజాల జగన్మోహన్ - చిత్తురు

అభ్యర్థుల ఎంపిక కోసం దాదాపు కోటి 3లక్షల మంది నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. మొత్తానికి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చాలా పకడ్బందీగా జాబితాను రూపొందించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More News

Mahesh:మహేష్‌ క్రేజ్‌ మామూలుగా లేదుగా.. 5 సెకన్ల వాయిస్‌కు రూ.5 కోట్లు..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల 'గుంటూరు కారం' సినిమాతో అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే.

Jana Sena:కాపులకు తీవ్ర అన్యాయం.. కేవలం 24 సీట్లేనా..?.. రగిలిపోతున్న జనసైనికులు..

118 మందితో టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది.

Saripodhaa Sanivaaram:ఇలాంటి పిచ్చోడిని ఎవరైనా చూశారా?.. 'సరిపోదా శనివారం' గ్లింప్స్ విడుదల..

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఇటీవల విడుదలైన 'దసరా' మూవీ బ్లాక్‌బాస్టర్ కాగా.. 'హాయ్ నాన్న' చిత్రం డీసెంట్ హిట్‌గా నిలిచింది.

TDP Jana Sena:టీడీపీ- జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. మొత్తం ఎన్ని స్థానాలంటే..?

టీడీపీ- జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

Raghuramakrishna Raju:వైసీపీకి ఎంపీ ర‌ఘురామకృష్ణరాజు రాజీనామా

వైసీపీకి నరసాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు(Raghurama krishna Raju) రాజీనామా చేశారు.