ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే సినిమా 'తను నేను' - హీరో సంతోష్ శోభన్
Send us your feedback to audioarticles@vaarta.com
అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్ చిత్రాలను సన్‌షైన్ సినిమాస్ బేనర్‌పై నిర్మించిన అభిరుచిగల నిర్మాత రామ్మోహన్ పి. తాజాగా 'వర్షం' వంటి సూపర్‌హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా, అవికా గోర్ హీరోయిన్గా నిర్మించిన 'తనునేను' చిత్రంతో దర్శకుడుగా కూడా మారారు నిర్మాత రామ్మోహన్. 'గోల్కొండ హైస్కూల్' చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించిన సంతోష్ శోభన్ 'తను నేను' చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. నవంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో హీరో సంతోష్ శోభన్‌తో ఇంటర్వ్యూ.
'తను నేను' చిత్రంలో మీ ఎంపిక ఎలా జరిగింది?
నేను బెంగుళూరులో చదువుకుంటున్నాను. సమ్మర్ హాలీడేస్‌కి హైదరాబాద్ వచ్చినపుడు రామ్మోహన్‌గారు ఒక స్క్రిప్ట్ ఇచ్చి చదవమన్నారు. నెక్స్ట్ డే నాకు ఆడిషన్ చేశారు. ఆ తర్వాత నాతో ఈ సినిమాకి సంబంధించి రిహార్సల్స్ చేయించారు. అలా నేను ఈ సినిమాకి సెలెక్ట్ అయ్యాను.
ఈ సినిమా షూటింగ్ సమయంలో మీరు మర్చిపోలేని సంఘటనలు ఏమైనా వున్నాయా?
ఒక్కటని చెప్పలేను. ఎందుకంటే షూటింగ్ చాలా మంచి అట్మాస్ఫియర్లో జరిగింది. ఈ బేనర్లో ఇంతకుముందే నటించాను కాబట్టి సన్‌షైన్ సినిమాస్‌లో పనిచేయడమంటే ప్రతి రోజూ ఒక మెమరబుల్ ఎక్స్‌పీరియన్సే. ఒక ఫ్యామిలీలా అందరూ వర్క్ చేస్తారు. చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ వుంటుంది. దాదాపు 35 రోజులు చాలా హ్యాపీగా గడిచిపోయాయి.
అవికా గోర్లాంటి ఎక్స్పీరియన్స్డ్ హీరోయిన్‌తో నటించడం ఎలా అనిపించింది?
ముందుగా అవికాకు థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను కొత్తవాడిని. నటన విషయంలో ఆమె చాలా సీనియర్. తను ఒక స్టార్ అయి వుండి నాలాంటి కొత్తవాడితో నటించడానికి ఒప్పుకోవడమనేది చాలా గొప్ప విషయం. అది నాకు గొప్పగా అనిపించింది.
రామ్మోహన్కి కూడా డైరెక్టర్‌గా ఇది మొదటి సినిమా. దానికి మీరు ఎలా ఫీల్ అయ్యారు?
రామ్మోహన్‌గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినప్పుడే ఇది చాలా మంచి సినిమా అవుతుందనిపించింది. ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు అవకాశం రావడమే గ్రేట్. గోల్కొండ హైస్కూల్ తర్వాత రామ్మోహన్‌గారు ఈ సినిమాతో నన్ను హీరోని చేశారు. ఒక మంచి కథ, మంచి కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా డెఫినెట్‌గా అందరికీ నచ్చుతుంది. రామ్మోహన్‌గారు ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేసినట్టుగా అనిపించదు. 30 సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్లా ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తీశారు.
ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కి రీచ్ అవుతుందా?
రామ్మోహన్‌గారు ఏ సినిమా చేసినా అందులో మంచి కథ వుంటుంది. అందర్నీ ఎంటర్టైన్ చెయ్యాలనే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తారు. అంతే తప్ప క్లాస్, మాస్ అనే తేడా ఆయన కథల్లో, సినిమాల్లో కనిపించదు. ఈ సినిమా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఈ విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను.
హీరోగా మీ ఫస్ట్ సినిమాకి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ఎంకరేజ్మెంట్ వుంది?
అది మాటల్లో చెప్పలేనిది. ప్రతి ఒక్కరూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమాల మీద నాకు వున్న ప్యాషన్ నాన్నగారి నుంచే వచ్చింది. నేను హీరోగా నటిస్తున్న తొలి సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రభాస్‌గారు, నానిగారు, కృష్ణవంశీగారు, త్రివిక్రమ్‌గారు, రవితేజగారు, సెంథిల్కుమార్గారు, ప్రభుదేవాగారు నాకు బెస్ట్ విషెస్ చెప్పారు. వాళ్ళందరికీ నా థాంక్స్. అలాగే మహేష్‌బాబుగారు నా కోసం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అది నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. నేను మహేష్‌బాబుగారికి తెలుసు అనే ఫీలింగ్ చాలా కిక్ నిస్తోంది. అలాగే ఫస్ట్ కాపీని చూసి నానిగారు, సురేష్‌బాబుగారు, రాజ్‌తరుణ్ నన్ను అప్రిషియేట్ చెయ్యడం చాలా ఆనందాన్ని కలిగించింది.
'తను నేను' హీరోగా ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు?
ఒక మంచి సినిమా, కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ మూవీ. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు. మా సినిమాని చూసి అందరూ మమ్మల్ని బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు నవ కథానాయకుడు సంతోష్ శోభన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com