మా అమ్మా నాన్న సహా అంతా జైలుకెళ్తారు: పరువు హత్యపై అవంతి
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌లో జరిగిన పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చందానగర్‌కు చెందిన హేమంత్.. అవంతి అనే యువతిని ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలో యువజంట నివాసముంటోంది. ప్రేమించి పెళ్లి చేసున్న యువ జంటపై యువతి తండ్రి, మేనమామ కక్ష కట్టారు. నిన్న సాయంత్రం 4 గంటలకు హేమంత్ ఇంటికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు హేమంత్, అవంతిలను కిడ్నాప్ చేశారు. అవంతి తప్పించుకుంది. హేమంత్‌ను సంగారెడ్డికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చారు.
తమను కిడ్నాప్ చేసినేప్పుడు సాయం కోసం అరిచినా.. అక్కడ చాలా మంది ఉన్నా ఎవరూ స్పందించలేదని అవంతి తెలిపింది. ఫోన్ చేసిన అరగంటకు పోలీస్ వ్యాన్ వచ్చిందని అవంతి వెల్లడించింది. ‘‘మమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు సాయం కోసం అరిచాం. చాలా మంది ఉన్నా ఎవ్వరూ సాయం చేయలేదు. ఫోన్ చేసిన అరగంటకు పోలీసు వ్యాన్ వచ్చింది. మా మేనమామ యుగంధర్ రెడ్డే నా భర్తను చంపాడు. హేమంత్‌కు ఆస్తులు లేవు. అయినా సంతోషంగా ఉండేవాళ్లం.
ప్రణయ్‌ను చంపించిన మారుతీరావు ఏమయ్యాడు? నా భర్తను చంపిన వారిని ఎన్‌కౌంటర్ చేసినా తప్పులేదు. మా అమ్మ, నాన్న సహా అందరూ జైలుకెళ్తారు. నా పేరుతో ఉన్న ఆస్తులన్నీ నాన్నకే రాసిచ్చా. మాకు ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పాం’’ అని వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com