స్టార్ మా లో ప్రతి సండే... స్పెషల్ !!
Send us your feedback to audioarticles@vaarta.com
అందరూ ఎదురుచూసేది ఆదివారం కోసం. ఆ ఆదివారం ఇంకా స్పెషల్ గా వుండాలని, ఓ మంచి అనుభూతిని మిగల్చాలని ఆదివారం మధ్యాహ్నం రెండు షో లు అందిస్తోంది స్టార్ మా. ఒకటి "స్టార్ట్ మ్యూజిక్". ఇంకోటి "కామెడీ స్టార్స్".
"స్టార్ట్ మ్యూజిక్" లో మ్యూజిక్ తో పాటు లాజిక్, మేజిక్ కూడా కలిపి ప్యాక్ చేసి అందించబోతున్నారు స్టార్ ప్రెజెంటర్ సుమ. ఈ షో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది . ఇక రెండో షో "స్టార్ట్ మ్యూజిక్". ఎన్నో టీవీ షో లలో తన సత్తా చూపించిన వర్షిణి ఈ షో ని నడిపించబోతున్నారు. 3 గంటల వరకూ సాగే ఈ సరదా ప్రయాణం లో ఎందరో సెలబ్రిటీ లు ఈ రెండు షో లలోనూ చేసే హుంగామా ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని అందిస్తుంది.
ఈ నెల 31 (ఆదివారం ) నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ రెండు షో లు స్టార్ మా లో ప్రారంభం అవుతున్నాయి. అందుకే స్టార్ మా లో ఆదివారం అవుతుంది అద్భుత వారం. కామెడీ, ఫన్, ఎంటర్టైన్మెంట్.. అన్నీ కలిసిన అందమైన ప్యాకేజీ తో స్టార్ మా సిద్ధంగా వుంది. ఈ నెల 31న మధ్యాహ్నం షో ల ప్రారంభానికి సుముహూర్తం.
స్టార్ట్ మ్యూజిక్ & కామెడీ స్టార్స్ ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Press release by: Indian Clicks, LLC
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout