ఎవర్ గ్రీన్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Monday,April 29 2019]

ఎవర్ గ్రీన్ క్రియేషన్స్ పతాకం పై రాజు శెట్టి దర్శకత్వం లో రవి కుమార్ రెడ్డి మరియు సత్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 3 చిత్రం ఈరోజు వాళ్ళ ఆఫీస్ లో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. యూనిట్ సభ్యులందరు పూజ కార్యక్రమం లో ఫల్గుని సినిమా విజయవంతం అవ్వాలని దేవుడి ని వేడుకున్నారు. అనంతరం పాత్రికేయుల సమావేశం లో

దర్శకుడు రాజు శెట్టి మాట్లాడుతూ ఎవర్ గ్రీన్ క్రియేషన్స్ పతాకం పై నిర్మిస్తున్న మూడో చిత్రం ఇది. రవి కుమార్ రెడ్డి మరియు సత్య రెడ్డి గారు నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది మాఫియా నేపథ్యం లో లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. సినిమా అంత గోవా లో మంచి రిచ్ లొకేషన్స్ లో సినిమా చేస్తున్నాము అని తెలిపారు.

నిర్మాతలు రవి కుమార్ రెడ్డి మరియు సత్య రెడ్డి మాట్లాడుతూ సినిమా కథ నాకు చాలా బాగా నచ్చింది. దర్శకుడు రాజు శెట్టి సినిమా ని అనుకున్న బడ్జెట్ లో ప్లాన్ చేసారు. సింగల్ షెడ్యూల్ లో సినిమా పూర్తీ చేయటానికి అని ప్రయత్నాలు చేస్తున్నాము. సుమన్ గారు, సుహాసిని గారు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సినిమా బాగా వస్తుంది అని నమ్మకం నాకుంది అని అన్నారు.

హీరోయిన్ లవ్లీ అగర్వాల్ మాట్లాడుతూ ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజు శెట్టి గారికి నిర్మాతలు రవి కుమార్ రెడ్డి మరియు సత్య రెడ్డి నా కృతఙ్ఞతలు అని తెలిపారు.

More News

దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా 'ఎవడు తక్కువ కాదు' ట్రైలర్ విడుదల!

విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఎవడు తక్కువ కాదు'. 'ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్'... ఉపశీర్షిక.

శ్రీలంకలో బుర్ఖా పై నిషేధం.. ఎందుకంటే...!

శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. సుమారు 300మందికి పైగా ఈ పేలుళ్లలో మరణించగా అంతకు రెట్టింపు మంది క్షతగాత్రులై ఆస్పత్రిలో

చిత్రీకరణ చివరి దశలో ఆమని 'అమ్మ దీవెన'

సత్య ప్రకాష్  తనయుడు నటరాజ్ ను హీరోగా పరిచయం చెస్తూ, ఆమని, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతొన్న చిత్రం "అమ్మ దీవెన".

'ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్‌కు జోడీ దొరికింది!

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.

రాహుల్‌ ఓడిపోతే రాజకీయాల్లో ఉండను.. మోదీకి ఓటమే!

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.