'భరత్ అను నేను' లోనూ అలాగే..
Send us your feedback to audioarticles@vaarta.com
రచయిత నుంచి దర్శకుడిగా మారిన కొరటాల శివ.. వరుస విజయాలతో అనతి కాలంలోనే టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్.. ఇలా ఇప్పటి వరకు స్టార్ హీరోలతోనే తన సినిమాలను చేసిన శివ.. తన నాలుగో చిత్రాన్ని కూడా మరో స్టార్ హీరోతో చేస్తున్న సంగతి తెలిసిందే.
శ్రీమంతుడు తరువాత మహేష్ బాబు కథానాయకుడిగా కొరటాల శివ రూపొందిస్తున్న ఆ చిత్రమే భరత్ అనే నేను. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. శివ గత చిత్రాలను పరిశీలిస్తే.. ప్రతి సినిమాలోనూ ఓ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ అవుతూనే ఉంది. మిర్చిలో వాన ఫైట్ ఎస్సెట్‌గా నిలిస్తే.. శ్రీమంతుడు లో మామిడి తోపు ఫైట్.. జనతా గ్యారేజ్‌లో గవర్నమెంట్ ఆఫీస్ ఫైట్ హైలైట్ అయ్యాయి.
ఇప్పుడు ఇదే వరుసలో.. భరత్ అనే నేను లో కూడా ఓ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందట. ఈ సారి హోలీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ పోరాట ఘట్టాన్ని శివ తీసారని సమాచారమ్. మరి.. రేపు స్క్రీన్‌పై ఈ సీన్‌కి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి. కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న భరత్ అనే నేను ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com