బాల‌య్య కూడా అంతేన‌ట‌

  • IndiaGlitz, [Saturday,November 05 2016]

బాల‌య్య ప్రెస్టిజియ‌స్ 100వ చిత్రం 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకుంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నామ‌ని నిర్మాత‌లు ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఓ రోజు ముందుగానే అంటే జ‌న‌వ‌రి 11న సినిమాను విడుద‌ల చేయాల‌ని ఇప్పుడు అనుకుంటున్నారట‌.

అందుకు కార‌ణం సంక్రాంతి సెల‌వులను అనుకూలంగా మార్చుకోవ‌డ‌మే. అందుకోస‌మ‌ని అనుకున్న విడుద‌ల తేదీ కంటే ఓ రోజు ముందుగానే రావాల‌ని అనుకుంటున్నార‌ట‌. అలాగే మ‌రోపైపు మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబ‌ర్ 150' సినిమాను కూడా ముందు జ‌న‌వ‌రి 13న విడుల చేయాల‌ని అనుకున్నారని న్యూస్ విన‌ప‌డింది. కానీ ఇప్పుడు సంక్రాంతి సెల‌వులు దృష్ట్యా జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఓకే రోజు ఇద్ద‌రు స్టార్ హీరోస్ సినిమాలు రానుండ‌టం. ఇద్ద‌రికీ ఈ రెండు ప్రెస్టిజియ‌స్ మూవీస్ కావ‌డం విశేషం. మ‌రి చివరికి ఏమౌతుందో చూడాలి...