నాని 'ఎవరితడు'..?

  • IndiaGlitz, [Monday,April 04 2016]

నేచురల్ స్టార్ నాని హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి హీరోగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా తర్వాత నా చేస్తున్న సినిమా ఇది. ఇందులో నాని డబుల్ రోల్ చేస్తున్నాడు. అష్టాచెమ్మా తర్వాత ఇదే కాంబినేషన్ లో వస్తున్న సినిమా వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ముందు ఈ సినిమాకు ధమాకా' అనే టైటిల్ అనుకున్నట్లు వార్తలు వినపడ్డప్పటికీ టైటిల్ పై వచ్చిన వార్తలను చిత్రయూనిట్ ఖండించింది. ఇప్పుడు ఈ సినిమాను నిర్మిస్తున్న శ్రీదేవి మూవీస్ బ్యానర్ ఎవరితడు', నాని జెంటిల్ మేన్' అనే రెండు టైటిల్స్ రిజిష్టర్ చేసింది. ఇంతకీ ఏ టైటిల్ వైపు యూనిట్ మొగ్గు చూపిస్తుందో చూడాలి.