ఆ సినిమాకు సీక్వెల్ వ‌స్తోంది..

  • IndiaGlitz, [Tuesday,December 05 2017]

12 ఏళ్ల క్రితం విడుద‌లై సూప‌ర్‌హిట్ సాధించిన కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఎవ‌డి గోల‌వాడిది'. స్వ‌ర్గీయ ద‌ర్శ‌కుడు ఈ.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆర్య‌న్ రాజేష్, దీపిక హీరో హీరోయిన్లుగా న‌టించారు.

రామ‌ల‌క్ష్మి సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పుడు ఈ సూప‌ర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ రానుంద‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌.

కమెడియన్ నుండి హీరోగా మారిన స‌ప్త‌గిరి ఈ సినిమాలో కథానాయ‌కుడిగా న‌టించనున్నాడు. ఈ విష‌యాన్ని ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ తెలియ‌జేశాడు. త్వ‌ర‌లోనే అధికార‌కంగా స‌మాచారం వెలువ‌డ‌నుంది.