చుట్టాలబ్బాయి శాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ టీవీ ఛానెల్ 'ఈటీవీ'
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్, ఎస్.ఆర్.టి.మూవీ హౌస్ సంయుక్తంగా నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'చుట్టాలబ్బాయి'. ఆది, నమితా ప్రమోద్ హీరో హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ కీలకపాత్రలో నటించారు. వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించారు. మంచి కుటంబ కథా చిత్రంగా సినిమా మంచి ఆదరణ పొందిన ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానెల్ ఈటీవీ చేజిక్కుంచుకుంది.
మంచి ప్రొడక్షన్ వేల్యూస్‌తో తెరకెక్కించిన ఈ సినిమా పృథ్వీ, అలీ, అభిమన్యుసింగ్, యామినీ మల్హోత్రా, సురేఖావాణి తదితరులు నటించారు. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
యంగ్ హీరోతో కొత్త సినిమా... శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ తలారి త్వరలోనే ఓ యువ కథానాయకుడితో సినిమా చేయడానిక సన్నాహాలు చేస్తున్నారు. వాటి వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com