ఈటల, కొండా కలిసి కేసీఆర్ సీటుకు ఎసరు పెడతారా?

ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం జరిగిందో ఏమో కానీ కొండా మాత్రం స్పీడ్ పెంచేశారు. తన మాటల్లో చేతల్లో చాలా జోష్ కనబరుస్తున్నారు. ఇద్దరు మంత్రులు టచ్‌లో ఉన్నారని హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటల, కొండా కలిసి ఉద్యమాకారులు, అసంతృప్తులతో కలిసి త్వరలోనే పార్టీ పెట్టవచ్చనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఇటు ఈటల మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం ఫుల్ సపోర్టు ఇస్తున్నారు. ఇదే అదునుగా బీజేపీ వాళ్లు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.

Also Read: కరోనా సంర‌క్ష‌ణా కేంద్రానికి అమితాబ్ భారీ విరాళం

ఈటలను చూస్తే మాత్రం అయోమయంగానే కనిపిస్తున్నారు. కొత్త పార్టీనా.. కాంగ్రెస్‌లోకా.. బీజేపీలోకా.. అనేది అర్థం కావడం లేదు. ఇటు కేసీఆర్ సర్కార్ మాత్రం రోజుకో ఊహించని షాకులిస్తోంది. ఈటల సొంత జిల్లాపై నజర్ పెట్టింది. ఆయన్ను ఎవరెవరు కలుస్తున్నారు.. ఆయన అనుచరులెవరు.. అండగా ఉన్న అధికారులెవరనేది తెలుసుకుని మరీ ఒక్కొక్కరినీ టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే ఈటలకు అనుకూలురుగా భావించే కొందరు అధికారులను బదిలీ చేసేసింది. అలాగే ఆయన అనుచరులుగా ఉన్న పుట్ట మధుపై కేసులు తిరగదోడే పనిలో పడింది. అలాగే ఈటల మరో అనుచరుడు, వీణవంక జడ్పీటీసీ భర్త సాదవ రెడ్డికి కెడీసీసీ బ్యాంక్ నోటీసులు పంపింది. ఈటలకు ఎటూ ఊపిరి సలపకుండా ప్రభుత్వం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు గులాబీ కోటలో కలకలం మొదలైంది. అధిష్టానం వైఖరిపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న నేతలంతా ఈటలను కలుస్తున్నారు. అలాగే తగిన గుర్తింపు దక్కని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఈటలను కలిసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈటలను కలిసే నేతల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా మహిళా టీఆర్ఎస్ నేత ఈటలతో భేటీ అవగా.. అధిష్టానం వైఖరిపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఈటల రాజేందర్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. మరికొందరు నేతలు సైతం ఈటలను కలిసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈటల కొత్త పార్టీ పెడతారనే ప్రచారం మరింత జోరందుకుంది. మొత్తానికి ఈటల, కొండా కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ సీటుకు ఎసరు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి.

More News

కరోనా సంర‌క్ష‌ణా కేంద్రానికి అమితాబ్ భారీ విరాళం

భారత్‌ను కొవిడ్ సెకండ్ వేవ్ అల్లకల్లోలం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా సామాన్యులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలన్న తేడా లేకుండా అంతా కరోనా బారిన పడుతున్నారు.

'పంచతంత్రం'లో విహారిగా నరేష్ అగస్త్య... అతని పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'.

కొవిడ్ బాధితులకు ‘రాధేశ్యామ్’ నిర్మాతల సాయం

కొవిడ్ సెకండ్ వేవ్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి.

ఏపీ నుంచి వచ్చే కొవిడ్ పేషెంట్స్‌కు తెలంగాణలోకి నో ఎంట్రీ..

ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కొవిడ్ రోగులను తెలంగాణ సర్కార్ అనుమతించక పోవడం సంచలనంగా మారింది.

ఏపీలో అత్యవసర ప్రయాణం చేయాలంటే ఇది తప్పనిసరి..

ఏపీలో మధ్యాహ్నం 12 తర్వాత నుంచి ఏపీలో కఠినంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలవుతున్న విషయం తెలిసిందే.