రాజీనామా సమర్పించిన ఈటెల.. కౌరవ, పాండవ యుద్ధమే ఇక!
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఈటెల విషయంలో టిఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్ర రాజీకీయాల్లో ఉత్కంఠగా మారాయి.
ఇదీ చదవండి: ఎండ X వాన: గత 121 ఏళ్ల చరిత్రలో.. మే నెలలో ఊహించని రికార్డులు
కాగా నేడు ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఆయన స్పీకర్ కార్యాలయంలో సమర్పించారు. ఈటెల రాజీనామాతో హుజురాబాద్ లో ఉపఎన్నిక అనివార్యంగా మారింది. ఈ నెల 14న ఈటెల బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే ఈటెల బిజెపి ఢిల్లీ పెద్దల్ని కలసి వచ్చిన సంగతి తెలిసిందే.
భూకబ్జా ఆరోపణలతో ఈటెల మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ అయ్యారు. కానీ పార్టీలో నియంతృత్వ పోకడలవల్లే తనని దూరం పెట్టారని ఈటెల ఆరోపిస్తున్నారు. రాజీనామా సమర్పించిన తర్వాత ఈటెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 17 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేశాను. ప్రజల ఆశీర్వాదంతోనే ఇప్పుడు రాజీనామా చేశాను. టిఆర్ఎస్ పార్టీ తనకు బి ఫారం ఇచినప్పటికీ.. నేను హుజురాబాద్ ప్రజల మద్దతుతో గెలిచాను.
హుజురాబాద్ లో కౌరవ, పాండవ యుద్ధం జరగబోతోంది. హుజురాబాద్ ఉపఎన్నిక తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతోంది. పోలిసులతో నన్ను నిర్బందించాలని చూస్తున్నారు. నిర్బంధం నాకు కొత్తకాదు. నియంత నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడమే నా ధ్యేయం అని ఈటెల అన్నారు.
త్వరలో తానూ హుజురాబాద్ లో పాదయాత్ర చేయబోతున్నట్లు ఈటెల అన్నారు. ప్రారంభం నుంచి టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ కేసీఆర్ కు సన్నిహితుడిగా ఈటెల ఉన్నారు. అలాంటి ఈటెలకు, పార్టీకి ఎక్కడ చెడింది అనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ జరుగుతున్న చర్చ.
ఇప్పటికే అధికారం టార్గెట్ గా పెట్టుకున్న బిజెపికి ఈటెల చేరిక ప్లస్ గా మారింది అని చెప్పొచ్చు. కానీ అధికారంలో ఉంది టిఆర్ఎస్ కనుక హుజురాబాద్ లో టగ్ ఆఫ్ వార్ ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments