Anganwadi workers:అంగన్‌వాడీ వర్కర్లపై 'ఎస్మా' అస్త్రం సంధించిన ప్రభుత్వం
Send us your feedback to audioarticles@vaarta.com
తమ డిమాండ్లు నెరవేర్చాలని నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వారిపై ఎస్మా చట్టం ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆరు నెలల పాటు ఎలాంటి సమ్మెలు, ఆందోళనలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. సమ్మెను అత్యవసరల జాబితా కిందకు తెస్తూ జీవో నెంబర్ 2 విడుదల చేసింది. అంతేకాకుండా సమ్మెలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యర్తలు, హెల్పర్ల జీతంలో కోత కూడా విధించింది. దాదాపు రూ.3వేలు తగ్గించి వారి ఖాతాల్లో జీతం జమ చేసింది.
తగ్గేదేలే అంటున్న అంగన్‌వాడీలు..
అయితే ప్రభుత్వ జారీచేసిన ఎస్మా ప్రయోగంపై అంగన్‌వాడీలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ హక్కుల కోసం పోరాడుతంటే ఇలాంటి చట్టాలు ఉపయోగిస్తున్నారని.. కానీ ఎస్మాకు భయపడేది లేదనే తేల్చి చెబుతున్నారు. తమపై ఈ చట్టం ప్రయోగించాలంటే అసలు మీ ప్రభుత్వం ఆరు నెలులు అధికారంలో ఉండాలి కదా అని హెచ్చరించారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రెండు నెలల్లో రానున్న ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. ఏది ఏమైనా ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ సమ్మె మాత్రం ఆగదని స్పష్టం చేశారు.
ఎస్మా ప్రయోగంపై లోకేశ్ ఫైర్..
అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగంపై టీడీపీ యువనేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. తక్షణమే జీవో నెంబర్ 2 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుంది? పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా? అని ఆయన ప్రశ్నించారు. అంతిమంగా నెగ్గేది అంగన్వాడీలేనని.. వారి ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని లోకేశ్ ట్వీట్ చేశారు.
అసలు ఏంటీ ఎస్మా చట్టం..?
అత్యవసర సర్వీసుల్లో ఉండే ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడం, సర్వీసులకు విఘాతం కలిగించేలా సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. 2013లో తీసుకొచ్చిన జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్ 39 పరిధిలోకి అంగన్వాడీలు వస్తారని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ చట్టం ప్రకారం ఉద్యోగుల సస్పెన్షన్‌తో పాటు డిస్మిస్, జరిమానా, జైలు శిక్ష విధించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. అంతే కాదు వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. అంటే నిబంధలను ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష కూడా విధించే అధికారం కూడా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments