'ఎర్రచీర' మొదటి షెడ్యూల్‌ పూర్తి

  • IndiaGlitz, [Tuesday,April 23 2019]

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బేబి డమరి సమర్పించు హర్రర్‌ మదర్‌ సెంటిమెంట్‌ 'ఎర్రచీర'. సుమన్‌బాబు, కారుణ్య, కమల్‌ కామరాజు, భానుశ్రీ, అజయ్‌, ఉత్తేజ్‌, మహేష్‌లు ముఖ్య పాత్రధాయిగా ఈ నెల 15న షూటింగ్‌ని ప్రారంభించి చిత్ర యూనిట్‌ విజయవంతంగా మొదటి షెడ్యూల్‌ని ముగించుకుంది.

కథలో ముఖ్య భూమిక పోషించిన ప్రధాన సన్నివేశాలను మొదటి షెడ్యూల్‌లో షూట్‌ చేసినట్లు, ఎంతో హృద్యంగా ఉండే ఈ సన్నివేశాలు కళ్ళను చెమర్చేలా చేస్తాయని, ఊహించిన దానికంటే ఎంతో అద్భుతంగా సీన్స్‌ వచ్చాయనీ తనకు సహకరించిన నటీనటుకి టెక్నీషియన్స్‌కి ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు దర్శకుడు సి.హెచ్‌.సుమన్‌బాబు.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌: సి.హెచ్‌.సుమన్‌ బాబు, మాటు: గోపి విమపుత్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: తోట సతీష్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌: ప్రమోద్‌ పులగిల్ల, కెమెరామెన్‌: చందు, చీఫ్‌ కొ'డైరెక్టర్‌: రాజమోహన్‌, కొ'డైరెక్టర్‌: నవీన్‌రామ్‌ నల్లం రెడ్డి, కాగా ఈ చిత్రానికి మహానటి ఫేం బేబి సాయి తుషిత పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ తెలిపింది.