ఎరోటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'రెడ్'

  • IndiaGlitz, [Friday,June 10 2016]
కన్నడలో అఖండ విజయం సాధించిన 'రెడ్‌' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మిస్తున్నారు యువ నిర్మాత భరత్‌. కామిని, రాహుల్‌, రాజ్‌ ఆర్యన్‌, పృధ్వి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని భరత్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆయన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఆలుమగల మధ్య ఓ అపరిచితుడు ప్రవేశించడం వల్ల.. వారి జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య సంఘటన సమాహారంగా రూపొందిన ఈ చిత్రం కన్నడలో అసాధారణ విజయం సాధించింది.
నిర్మాత భరత్‌ మాట్లాడుతూ.. 'ఈ చిత్రానికి కన్నడలో దర్వకత్వం వహించిన రాజేష్‌మూర్తి ఈ చిత్రాన్ని కన్నడలో నిర్మించడంతోపాటు సంగీతం కూడా సమకూర్చడం విశేషం. ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ ప్రేక్షకులకు రసానుభూతిని పంచే ఎరోటిక్‌ మర్డర్‌ మిస్టరీ 'రెడ్'. కన్నడలో కంటే తెలుగులో ఈ చిత్రం మరింత పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి' అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అంజన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: డా॥శివ వై.ప్రసాద్‌, నిర్మాత: భరత్‌, సంగీతం-దర్శకత్వం: రాజేష్‌మూర్తి.

More News

పవన్ టైటిల్ తో రానా..

పవన్ టైటిల్ తో రానా..అనగానే ఇంతకీ ఏ టైటిల్ అనుకుంటున్నారా..?సర్ధార్..!

సుల్తాన్ గా స‌రైనోడు..

సుల్తాన్ గా స‌రైనోడు అన‌గానే..బ‌న్ని న్యూమూవీ టైటిల్ అనుకుంటే పొర‌పాటే. అస‌లు విష‌యం ఏమిటంటే...స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన స‌రైనోడు చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే.

ఆ చిత్రంలో సూర్య నటిస్తున్నాడా...

వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకునే సూర్య ఇటీవల 24మూవీతో సక్సెస్ సాధించారు.

ఈనెల 12 న గుంటూరులో అఆ విజయోత్సవ వేడుక

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్,సమంత,అనుపమ పరమేశ్వరన్ లతో రూపొందిన చిత్రం అ ఆ.ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)నిర్మించారు.

వినోదభరితమైన పోలీస్ పాత్రలో శర్వానంద్

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సీనియర్ నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్,శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై