బోల్డ్ సీనా.. అయితే ముందే క్లారిటీ ఇవ్వాలి
- IndiaGlitz, [Friday,May 28 2021]
బోల్డ్ కంటెంట్, అడల్ట్ కామెడీ ఉండే చిత్రాలు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. ఈ చిత్రాల్లో ఇంటిమేట్ రొమాంటిక్ సీన్లు, శృంగార భరిత సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఎమోషనల్ ప్రేమ కథలు కూడా ఉంటాయి. వాటిలో అవసరమైన చోట రొమాంటిక్ సీన్లు తప్పవు. ఇలాంటి సన్నివేశాల్లో నటించేందుకు అందరు హీరోయిన్లు సిద్ధంగా ఉండరు. తమకు ఇలాంటివి కంఫర్టబుల్ కాదని తేల్చేస్తారు. తాను కూడా ఆ కోవకు చెందిన నటినే అంటోంది ఎరికా ఫెర్నాండేజ్.
ఇదీ చదవండి: వైరల్ పిక్స్ : భర్తతో రొమాంటిక్ మూడ్ లో కాజల్
ఎరికా ఫెర్నాండేజ్ తెలుగులో గాలిపటం, డేగ లాంటి చిత్రాల్లో నటించింది. తాజాగా ఎరికా ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ సన్నివేశాల గురించి మాట్లాడుతూ.. అలాంటి సన్నివేశాల్లో నటించడం ఇష్టం ఉండదు. కొన్ని చిత్రాల్లో అర్థం పర్థం లేకుండా బలవంతంగా బోల్డ్ సన్నివేశాలని చొప్పిస్తారు. అలాంటి వాటిని నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసేస్తాను అని తెలిపింది.
కొన్ని చిత్రాల్లో బోల్డ్ సన్నివేశాలు తప్పనిసరి. ఆ సీన్లు అత్యంత కీలకం అయితే ముందుగా నాకు క్లారిటీ ఇవ్వాలి. అప్పుడే తాను మెంటల్ గా ప్రిపేర్ అవుతాను అని ఎరికా చెప్పుకొచ్చింది.
ఎరికా ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ సిరీస్ లు కూడా చేస్తోంది. అవసరం అయితేనే గ్లామర్ అనే పాలసీని అనుసరిస్తోంది ఈ యంగ్ బ్యూటీ.