హీరోయిన్‌తో స‌మానంగా...

  • IndiaGlitz, [Thursday,April 25 2019]

జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగాంతో యాంక‌ర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న అన‌సూయ‌.. ఇప్పుడు నెమ్మ‌దిగా సినిమాల వైపు అడుగులు వేస్తుంది. పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంటూ వ‌స్తోంది. గ‌త ఏడాది మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ 'రంగ‌స్థ‌లం'లో రంగ‌మత్త పాత్ర‌లో న‌టించి మెప్పించింది.

ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో న‌టించబోతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. చిరంజీవి 152వ చిత్రం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్ పాత్ర‌కు స‌మాన ప్రాధాన్య‌మున్న పాత్ర‌లో అన‌సూయ పాత్ర‌ను కొర‌టాల డిజైన్ చేశార‌ట‌. పాత్ర విన‌గానే అన‌సూయ ఏ మాత్రం ఆలోచించ‌కుండా న‌టించ‌డానికి ఓకే చెప్పేసింద‌ట‌.