ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే...

  • IndiaGlitz, [Friday,August 14 2020]

ప్రవేశ పరీక్షలపై ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు పరీక్షల తేదీలను కూడా వెల్లడించింది. దీంతో ఏపీలో కూడా విద్యార్థులు ప్రవేశ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు. దీనిలో భాగంగానే శుక్రవారం ఏపీ ప్రభుత్వం ప్రవేశ పరీక్షల తేదీలను వెల్లడించింది. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నేడు పరీక్ష తేదీలను ప్రకటించారు.

సెప్టెంబర్ 17 నుంచి ఏపీలో ప్రవేశ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. 17 నుంచి 25 వరకు ఎంసెట్..సెప్టెంబర్ 14న ఈసెట్.. సెప్టెంబర్ 10, 11న ఐసెట్.. ఏపీజీఈ సెట్ సెప్టెంబర్ 28, 29, 30
ఎడ్‌సెట్ (ఉదయం), లాసెట్ (మధ్యాహ్నం) అక్టోబర్ 1 అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఏపీపీఈ సెట్ నిర్వహించనున్నారు. విద్యారంగంలో పెనుమార్పులు తీసుకొచ్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బడ్జెట్‌లో ప్రత్యేకంగా 16 శాతం నిధులను దీనికోసం కేటాయించారని ఇటీవల ఆదిమూలపు సురేష్ తెలిపారు.

More News

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమం..

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 5న ఆయనకు కరోనా సోకింది.

ప‌వ‌న్ 29 ఖ‌రారైందా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో ఉంటూనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ముందుగా పింక్ రీమేక్ వ‌కీల్‌సాబ్ రీమేక్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

శంఖం ఊదుతూ బురదలో కూర్చుంటే కరోనా సోకదు: బీజేపీ ఎంపీ

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడిపోయింది.

రెండేళ్లు పూర్తి చేసుకున్న గీత గోవిందం

మెగా నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో GA 2 పిక్చర్స్ పతకం పై సక్సెసఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన సినిమా "గీత గోవిందం".

నిహారిక నిశ్చితార్థానికి పవన్ హాజరు కాకపోవడానికి కారణమిదే..

మెగా డాటర్ నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది.