'ఎంత వరకు ఈ ప్రేమ' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Tuesday,November 15 2016]

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ 'కవలై వేండాం'. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఎంత వరకు ఈ ప్రేమ' అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. 'యామిరుక్క బ‌య‌మేన్‌' ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తెలుగు, త‌మిళంలో సినిమాను న‌వంబ‌ర్ 24న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా.....

డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ " తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కల‌యిక‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఎంత‌వ‌ర‌కు ఈ ప్రేమ‌'. అవుటండ్ అవుట్ కామెడితో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా ద‌ర్శ‌కుడు డీకే గారు సినిమాను అద్భుతంగా రూపొందించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన పాట‌లకు అల్రెడి తెలుగు, త‌మిళంలో మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. సినిమాను న‌వంబ‌ర్ 24న తెలుగు, త‌మిళంలో గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. 'ఎంత వ‌ర‌కు ఈ ప్రేమ‌' మా డీవీ సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌కు మంచి పేరు తెచ్చే చిత్ర‌మ‌వుతుంది'' అన్నారు.

జీవా, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజమ్, మ్యూజిక్: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డీకే.