అక్టోబర్ 27న 'ఎంత వరకు ఈ ప్రేమ' ఆడియో

  • IndiaGlitz, [Thursday,October 20 2016]

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ 'కవలై వేండాం'. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఎంత వరకు ఈ ప్రేమ' అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. 'యామిరుక్క బ‌య‌మేన్‌' ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని అక్టోబ‌ర్ 27న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సందర్భంగా....

డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ " తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ అంటేనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో ఈ చిత్రాన్ని ఎంత‌వ‌ర‌కు ఈ ప్రేమ అనే పేరుతో విడుద‌ల చేస్తున్నాం. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈసినిమా ఆడియో అల్రెండి త‌మిళంలో విడుద‌లైన మంచి స‌క్సెస్‌ను సాధించాయి. తెలుగు ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని అక్టోబ‌ర్ 27న నిర్వ‌హిస్తున్నాం.తెలుగు, త‌మిళంలో సినిమా ఒకేసారి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

జీవా, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజమ్, మ్యూజిక్: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డీకే.

More News

'ఒక్కడొచ్చాడు' టీజర్ విడుదల చేస్తున్న కాజల్....

పందెంకోడి,పొగరు,భరణి,పూజ,రాయుడు వంటి హిట్ చిత్రాల తర్వాత తెలుగులో నేను చేస్తున్న మరో మంచి సినిమా 'ఒక్కడొచ్చాడు'.

లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్న డిఫరెంట్ మూవీ శంకర - డైరెక్టర్ తాతినేని సత్య

నారా రోహిత్ -రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం శంకర.ఈ చిత్రాన్ని భీమిలి కబడ్డీ జట్టు,ఎస్.ఎం.ఎస్ చిత్రాల దర్శకుడు తాతినేని సత్య ప్రకాష్ తెరకెక్కించారు.

నేను ఎవరి కోసం ఎదురు చూడను - పూరి జగన్నాథ్..

కమర్షియల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ అంటే పూరి...!హీరోలను సరికొత్తగా చూపించే డైరెక్టర్ అంటే పూరి..!తక్కువ టైమ్ లో ఎక్కువ సినిమాలు చేసే స్పీడు డైరెక్టర్ అంటే పూరి..!

36 ఇండ్యూజువల్ క్యారెక్టర్స్ తో 'చల్ చల్ గుర్రం'

సాధారణంగా సినిమాల్లోని పాత్రల మధ్య రిలేషన్స్ ఉంటాయి. కానీ చల్ చల్ గుర్రం సినిమాలో పాత్రల మధ్య రిలేషన్స్ ఉండవు. అలా రిలేషన్ లేని 36 పాత్రల మధ్య నడిచే కథే `చల్ చల్ గుర్రం` అని అన్నారు దర్శకుడు మోహన ప్రసాద్.

ప్రేమ‌మ్ సినిమా తీయ‌డానికి గ‌ట్స్ కావాలి.. చైత‌న్య అద్భుతంగా న‌టించాడు - నాగార్జున

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ప్రేమ‌మ్. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్నినిర్మించారు.