అక్టోబర్ 27న 'ఎంత వరకు ఈ ప్రేమ' ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
`రంగం` వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ `కవలై వేండాం`. ఈ చిత్రాన్ని తెలుగులో `ఎంత వరకు ఈ ప్రేమ` అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. `యామిరుక్క బయమేన్` ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని అక్టోబర్ 27న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా....
డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ " తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ అంటేనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో ఈ చిత్రాన్ని ఎంతవరకు ఈ ప్రేమ అనే పేరుతో విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈసినిమా ఆడియో అల్రెండి తమిళంలో విడుదలైన మంచి సక్సెస్‌ను సాధించాయి. తెలుగు ఆడియో విడుదల కార్యక్రమాన్ని అక్టోబర్ 27న నిర్వహిస్తున్నాం.తెలుగు, తమిళంలో సినిమా ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
జీవా, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజమ్, మ్యూజిక్: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డీకే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com