Engagement:'ఎంగేజ్మెంట్' చిత్రం షూటింగ్ పూర్తి..
Send us your feedback to audioarticles@vaarta.com
సూరమ్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తూ.. రోడియం ఎంటర్ టైన్మెంట్స్ సమర్పిస్తున్న తాజా చిత్రం ఎంగేజ్మెంట్. రాజు బొనగాని దర్శకత్వంలో ప్రవీర్ శెట్టి, ఐశ్వర్య గౌడ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఎంగేజ్మెంట్ చిత్రం విజయవంతంగా షూటింగును పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా ఎంగేజ్మెంట్ చిత్ర నిర్మాత జయరామ్ దేవసముద్ర మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఆగస్టు నుండి సెప్టెంబర్ చివరి వరకు కూర్గు, చిన్మంగళూర్, మైసూర్, గోవా ముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో ఏకధాటిగా చిత్రీకరణ జరిపినట్లు తెలిపారు. ప్రొడక్షన్ పరంగా ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకుండా గొప్ప నిర్మాణ విలువలతో చిత్రాన్ని రూపొందించిమని, సినిమా అవుట్ ఫుట్ కూడా ఊహించిన దాని కంటే క్వాలిటీ గా, అద్భుతంగా వచ్చిందని, అలాగే అనుకున్న టైంలో అనుకున్న షెడ్యూల్లో దర్శకుడు రాజు బోనగాని తన ప్రతిభతో చిత్రాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించాడని నిర్మాత జయరామ్ దేవసముద్ర పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంగేజ్మెంట్ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందని, త్వరలొనే తదుపరి అప్డేట్ ఇస్తామని మేకర్స్ తెలిపారు.
ఎంగేజ్మెంట్ చిత్రంలో హీరోగా ప్రవీర్ శెట్టి చాలా బ్రహ్మాండంగా నటించాడని, ప్రేక్షకులను కచ్చితంగా మెప్పించే పెర్ఫామెన్స్ ను అందించాడని, అలాగే హీరోయిన్ ఐశ్వర్య గౌడ ఇందులో మెస్మరైజ్ చేసే తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుందని మేకర్స్ వెల్లడించారు. మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ కూడా ఎక్కడ తగ్గకుండా అందరూ తమ సొంత సినిమా లాగా కష్టపడ్డారని మేకర్స్ పేర్కొన్నారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసి, అపారమైన విజువల్ ఎఫెక్ట్స్ అనుభవం ఉన్న దర్శకుడు రాజు బొనగాని ఎంగేజ్మెంట్ చిత్రాన్ని యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు చాలా ఆసక్తికరమైన పాయింట్ తో తెరకెక్కించినట్లు, ఈ చిత్రాన్ని పాన్ ఇండియాగా తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాల్, ఒడియా భాషలలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
నటీనటులు: ప్రవీర్ శెట్టి, ఐశ్వర్య గౌడ, రాజగోపాల్ అయ్యర్, బలరాజ్ వాడి, భావన, రజని శ్రీ కాల, శరద్ వర్మ, దీప్తిగుప్త, సుజయ్ రామ్ డీజే తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments