ఈడీ లేఖతో కలకలం... మళ్లీ తెరపైకి టాలీవుడ్‌కు డ్రగ్స్ కేసు, ఈసారి డొంక కదలేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్నేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన రికార్డులు సమర్పించాల్సిందిగా తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసింది. డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, సాక్షులు, నిందితుల వాంగ్మూలానికి సంబంధించిన వివరాలు అందజేయాలని ఈడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈడీ అధికారులు ఎలాంటి వివరాలు అడిగినా వెంటనే అందజేయాలని తెలంగాణ హైకోర్టు కోరింది.
ఎన్నిసార్లు అడిగినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఈడీ అధికారులు ఇటీవలే హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఇవ్వాలని ఆదేశించింది. విచారణకు ప్రభుత్వం సహకరించాలని .. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈడీ దరఖాస్తు చేసిన పక్షంలో 15 రోజుల్లోగా వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.
అలాగే టాలీవుడ్ డ్రగ్స్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి గతంలో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ క్రమంలోనూ డిజిటల్ రికార్డుల అంశం తెరపైకి వచ్చింది. తాము దర్యాప్తు చేస్తామంటూ ఈడీ ఇదివరకే ఈ కేసులో ఇంప్లీడ్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనూహ్యంగా ఈడీ ఎంట్రీ కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతేకాదు.. పూరి జగన్నాథ్, తరుణ్ , చార్మీ, నందు, రానా, రవితేజ సహా 11 మంది ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఓ వైపు ఈడీ టాలీవుడ్ సెలబ్రిటీల్ని విచారిస్తూండగానే ఎవరిపైనా బలమైన ఆధారాలు లేవంటూ అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేసింది తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments