Postal Ballot: పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైసీపీకే.. సీఎం జగన్ వైపే ఉద్యోగుల చూపు..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా వారం రోజులు సమయం మాత్రమే ఉంది. వచ్చే సోమవారం పోలింగ్ జరగనుంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఎండల కంటే ఎక్కువగా హీటెక్కింది. మరోవైపు శనివారం నుంచి రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఉద్యోగుల ఓట్లు అధికార వైసీపీకే పడుతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఓటు వేసిన ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు జగన్ పార్టీకే వేశామని చెబుతున్నారని తెలుస్తోంది.
దాదాపు 80శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకే అనుకూలంగా ఓట్లు వేస్తున్నారని సమాచారం. ఉద్యోగులు జగన్ వైపు మొగ్గు చూపడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఉద్యోగుల జీతాల విషయంలో బాబు చేసిన అవహేళన సులువుగా మరిచిపోలేరు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు పయోజనం చేకూరేలా బాబు ఎలాంటి హామీలను ప్రకటించలేదు. అదే జగన్ ప్రకటించిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ మాత్రం ఉద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ అందజేసే స్కీమ్ అని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.
చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు ఏరోజు సంతోషంగా లేరు. బాబు రూల్స్ అంటే చీదరించుకునే ఉద్యోగులు చాలామంది ఉన్నారు. మరోవైపు చంద్రబాబు ప్రకటించిన హామీలు అలివి కాని హామీలు అని చెబుతున్నారు. ఆ హామీలను అమలు చేస్తే ప్రతి నెలా కాదు కదా అసలు జీతాలే రావేమో అనే భయం ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొంది. అందుకే వైసీపీకి అనుకూలంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని.. ఫ్యాన్ గుర్తుకు భారీగా ఓట్లు పోల్ అవుతున్నాయని తెలుస్తోంది. బాబు పాలనకు, జగన్ పాలనకు తేడా గమనించిన ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి జగన్‌కే పట్టం కట్టడానికి సిద్ధమయ్యారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com