ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్  "ఏనుగు" కు క్లీన్ U/A

  • IndiaGlitz, [Saturday,June 25 2022]

శ్రీమతి జగన్మోహని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్,సముద్రఖని, KGF రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, నటీ నటులుగా సింగం సిరీస్ వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసి బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరి దర్శకత్వంలో సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఏనుగు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై 1 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.

ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... సింగం సిరీస్, పూజ సినిమాలతో కమర్శియల్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరి నెక్స్ట్ సినిమా ఏనుగు. హరితో కలసి మేము మంచి కంటెంట్ ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యలని ఎంటర్టైన్మెంట్ రూపంలో ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. తెలుగులో దర్శకుడు హరి చేసిన గత సినిమాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో ఇప్పుడు వస్తున్న కమర్శియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఏనుగుచిత్రం కూడా అంతే పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు వారు సినిమా చాలా బాగుందని U/A సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది.ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. గోపీనాథ్ గారు ఎక్సలెంట్ మేకింగ్ ఇచ్చారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఏనుగు చిత్రాన్ని జులై 1 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న ఈ సినిమాను తెలుగు తమిళ్ లో ఒకే సారి రిలీజ్ చేస్తున్నాము . ఫ్యామిలీ తో వచ్చి చూసే విధంగా ఉన్న ఈ ఏనుగు సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతూ బయటకు వస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు హరి మాట్లాడుతూ... మంచి కంటెంట్ తో వస్తున్న ఈ ఏనుగు సినిమా నాకు 16వ సినిమా. ఇందులో ఎమోషనల్ కంటెంట్ తో పాటు మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఇందులో చూయించడం జరిగింది.అలాగే ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ ఇలా ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఫ్యామిలీ తో వచ్చి చూసే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.ఇంతకుముందు నేను చేసిన చిత్రాలను ఆదరించి నట్లే ఇప్పుడు మంచి కంటెంట్ తో జులై 1 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ 'ఏనుగు సినిమాను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నటీనటులు: అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, యోగి బాబు, అమ్ము అభిరామి, KGF రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, ఆడుకలం జయపాలన్, ఇమ్మాన్ అన్నాచ్చి, రాజేష్, ఐశ్వర్య, బోస్ వెంకట్, సంజీవ్, పుగజ్

More News

Kommu Konam Fish: వలలో చిక్కిన అరుదైన చేపలు.. కోటీశ్వరులైన ఇద్దరు జాలర్లు

కొంతమందికి రాత్రికి రాత్రే అదృష్టం కలిసి వస్తుంది. కొందరు జాలర్ల విషయంలో ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది.

Janasena : సమీక్షా సమావేశాలతో పవన్ బిజిబిజీ.. ఏపీ, తెలంగాణ నేతలతో వరుస భేటీలు, ఎన్నికలపై దిశానిర్దేశం

ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వుండటంతో జనసేన అధినేత పపన్ కల్యాణ్ యాక్టీవ్ అయ్యారు.

Janasena : జనసేన మహిళా నేతకు అర్థరాత్రి పూట ఫోన్లు, బాలినేని గారూ.. ఇది కరెక్ట్ కాదు : పవన్ ఆగ్రహం

తమ పార్టీ అధికార ప్రతినిధి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ ఎమ్మెల్యే అనుచరులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.

Nandamuri Balakrishna: కరోనా బారినపడ్డ నందమూరి బాలకృష్ణ.. ఫ్యాన్స్‌కి జాగ్రత్తలు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వ్యాక్సినేషన్, లాక్‌డౌన్‌, ఇతర చర్యలు చేపట్టి థర్డ్ వేవ్‌ను సులభంగానే తప్పించుకున్నప్పటికీ భారత్‌లో

Chintamani Natakam : రఘురామకు చుక్కెదురు.. ‘‘ చింతామణి ’’పై ఏపీ సర్కార్ నిషేధం, స్టేకు హైకోర్టు నో

తెలుగు ప్రజల ఆల్‌టైమ్ ఫేవరేట్ నాటకాల్లో ఒకటైన చింతామణి నాటకంపై ఏపీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.