100 మిలియన్ల 'ఎల్లువొచ్చి గోదారమ్మ'.. పూజా హెగ్డే రెస్పాన్స్ చూశారా.. 

అప్పటి వరకు క్లాస్ గా కనిపించిన వరుణ్ తేజ్ ని మాస్ లుక్ లోకి మార్చేసిన చిత్రం 'గద్దలకొండ గణేష్'. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అథర్వ, మృణాళిని కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ మేకోవర్, మాస్ యాక్టింగ్ ఒక ఎత్తైతే.. పూజా హెగ్డే అందాలు ఆరబోస్తూ కనువిందు చేసిన 'ఎల్లువొచ్చి గోదారమ్మ' సాంగ్ మరో ఎత్తు. ఆల్ టైం క్లాసిక్ సాంగ్స్ లో ఎల్లువొచ్చి గోదారమ్మ ఒకటి. ఆ సాంగ్ ని ఈ చిత్రం కోసం రీమిక్స్ చేశారు. అప్పట్లో శ్రీదేవి అందాలు ఆ పాటకు ఎంతగా ప్లస్ అయ్యాయో.. ఈ చిత్రంలో పూజా గ్లామర్ అంతగా అలరించింది.

తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా పూజా హెగ్డే ట్విట్టర్ లో స్పందించింది. ప్రతి ఒక్కరూ ప్రేమాభిమానాలు చూపించే ఇలాంటి సాంగ్ లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఫిజికల్ గా ఈ పాటషూటింగ్ చాలా కష్టమైనది. అలాంటి సాంగ్ 100 మిలియన్లకు చేరుకోవడం సంతోషాన్నిచ్చే అంశం. ఈ పాటని రీమేక్ చేయాలనుకున్న హరీష్ శంకర్ కల వల్లే ఇది సాధ్యమైంది అని పూజా హెగ్డే ట్వీట్ చేసింది.

'నీ హార్డ్ వర్క్, డెడికేషన్ స్క్రీన్ పై కనిపించింది. ఈ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు నా సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఈ సాంగ్ లో నా శ్రీదేవిగా నటించినందుకు ధన్యవాదాలు అని హరీష్ పూజా హెగ్డే పై ప్రశంసలు కురిపించాడు.

పూజా హెగ్డే ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధే శ్యామ్ చిత్రాల్లో నటిస్తుండగా.. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ చిత్రం కోసం కసరత్తు చేస్తున్నారు.

More News

వికటించిన కరోనా వ్యాక్సిన్.. దేశంలో తొలి మరణం!

దేశం నలువైపులా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా ధాటిని తట్టుకునేందుకు అనేక వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చాయి.

బుర్రకథ హీరోయిన్ అరెస్ట్.. స్నేహితుడితో కలసి గంజాయి తీసుకుంటూ..

యంగ్ హీరోయిన్ నైరా షాని నార్కోటిక్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఈ సంఘటన జరిగింది.

నితిన్ లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఈసారి డెబ్యూ డైరెక్టర్ తో..

యూత్ స్టార్ నితిన్ వరుస చిత్రాలని చకచకా పూర్తి చేస్తున్నాడు. నితిన్ ఇప్పటికే ఈ ఏడాది రెండు చిత్రాలని రిలీజ్ చేశాడు.

కోవిడ్ తగ్గాక కీళ్ల నొప్పులు అందుకే.. టీకా, థర్డ్ వేవ్ గురించి ప్రముఖ ఆర్థోపెడిక్..

కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ కీళ్లు, కండరాలకు సంబంధించిన నొప్పులు వస్తున్నాయి.

స్టార్ హీరోకి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్న దిల్ రాజు?

బాహుబలి తర్వాత చిత్ర పరిశ్రమలో భాషా పరిమితులు చెల్లాచెదురయ్యాయి. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా చిత్రాలు అంటున్నారు.