తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు.. యూనిట్‌కి ఎంత, ఎప్పటి నుంచి అమలంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంపునకు టీఎస్ఈఆర్‌సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఛైర్మన్ టి.శ్రీరంగారావు కీలక ప్రకటన చేశారు. 2022-23 ఏడాదికి డిస్కమ్‌లు ప్రతిపాదించిన రెవెన్యూ గ్యాప్ రూ.16 వేల కోట్లని..కానీ, రూ.14,237 కోట్ల రెవెన్యూ గ్యాప్‌ను కమిషన్ ఆమోదించిందని శ్రీరంగారావు అన్నారు. రెవెన్యూ అవసరాలు రూ.53 వేల కోట్లుగా ఏఆర్‌ఆర్ ప్రతిపాదించగా.. కమిషన్ రూ.48,708 కోట్లు ఆమోదించిందని ఆయన చెప్పారు. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌పై రూపాయి పెంచుతున్నట్లు శ్రీరంగారావు పేర్కొన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి అని టీఎస్ఈఆర్సీ ఛైర్మన్ తెలిపారు.
అయితే గతంలోనే పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు ఇచ్చిన డిస్కంలు.. 19 శాతం పెంపునకు అనుమతి కోరాయి. కానీ, ఈఆర్సీ మాత్రం 14 శాతానికే అనుమతి ఇవ్వడం గమనార్హం. డిస్కమ్‌లకు 10 వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉన్నట్లు డిసెంబర్ నెలలోనే నివేదికలు సమర్పించాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వగా.. టీఎస్ ఈఆర్సీ అంగీకారం తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout