CM Jagan:ఎన్నికలు ముందే జరగొచ్చు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

  • IndiaGlitz, [Friday,December 15 2023]

ఏపీ ఎన్నికలపై మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019తో పోలిస్తే ఈసారి 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలోనూ ముందుగా ఎన్నికలు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ముందుకు రావాలని అనుకుంటోందన్న సంకేతాలు వస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. విపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని.. ఎన్నికలకు వైసీపీ పూర్తి సన్నద్ధంగా ఉందని జగన్ స్పష్టం చేశారు.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 45 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఇందులో జనవరి నుంచి పెన్షన్లను రూ.2,750 నుంచి రూ.3వేలకు పెంపు.. జనవరిలో వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాలు అమలుకు ఆమోదం తెలిపారు.

కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఆరోగ్య శ్రీ కింద చికిత్స పరిమితి రూ.25లక్షలకు పెంపు
'మిగ్‌జాం' తుఫాన్‌ నష్ట పరిహారం అందించేందుకు ఆమోదం
జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు మంత్రివర్గం ఆమోదం
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం
విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్ట్ DPRకు ఆమోదం
విశాఖలోని 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ఆమోదం
జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు మంత్రివర్గం ఆమోదం
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం
11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటుకు ఆమోదం
శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు..
తిరుపతి, అనంతపురం వైద్య కళాశాలల్లో అంకాలజీ విభాగం ఏర్పాటుకు ఆమోదం