కరోనా నేపథ్యంలో ఎన్నికలు సాధ్యం కాదు: సీఎస్ సాహ్ని

  • IndiaGlitz, [Wednesday,November 18 2020]

ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు సీఎస్‌ నీలం సాహ్ని లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలు సాధ్యం కాదని నీలం సాహ్ని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులు, అధికారులు కరోనా విధుల్లో ఉన్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు తెలియజేస్తామని లేఖ రాశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికల నిర్వహణ సరికాదంటూ సీఎస్‌ లేఖ రాశారు. నేడు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ సాధ్యం కాదని సీఎస్‌ సాహ్ని తెలిపారు. ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నామని లేఖలో సీఎస్‌ నీలం సాహ్ని వెల్లడించారు.

కాగా.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు లాక్‌డౌన్‌కు పూర్వమే జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జగన్ సర్కార్.. ప్రత్యేక ఆర్డినెన్స్‌‌ను తీసుకొచ్చి ఆయనను పదవి నుంచి తొలగించింది. దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. కానీ స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవడంతో ఆయన ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఆ తర్వాత నిమ్మగడ్డను ప్రభుత్వం మళ్లీ ఎస్‌ఈసీగా నియమించగా బాధ్యతలు స్వీకరించారు.

కరోనా తీవ్రత కాస్త తగ్గడంతో తిరిగి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సమాయత్తమవుతున్నారు. ఫిబ్రవరిలో నిర్వహించున్నామని తాజాగా ఒక ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి వెల్లడించారు. కానీ ఏపీ ప్రభుత్వం మరోసారి అభ్యంతరం తెలిపింది. దీంతో మరోసారి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. సీఎస్ నీలం సాహ్ని లేఖపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More News

‘ఆచార్య‌’ కోసం చిరు ఇలా.. కాజ‌ల్ అలా..!

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ కోవిడ్‌ నేపథ్యంలో రీస్టార్ట్‌  అయ్యింది.

‘వ‌కీల్‌సాబ్’ సంక్రాంతి రేసులో లేన‌ట్టేనా?

2020 సినీ అభిమానులకు నిరాశను మిగిల్చిన సంవత్సరమనడంలో సందేహం లేదు. చిత్ర పరిశ్రమ దాదాపు ఆరేడు నెలల పాటు సైలెంట్ అయ్యింది.

ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు.. కొత్త జిల్లాలకు బ్రేక్..

ఏపీ‌లో కరోనా కారణంగా ఆగిపోయిన పంచాయితీ ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతోంది. ఈ ఎన్నికలు  ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం: పవన్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది.

క‌మెడియ‌న్‌కి విజ‌య్ సేతుప‌తి స‌పోర్ట్‌

విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి మ‌రోసారి త‌న దాతృత్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. సీనియ‌ర్ కోలీవుడ్ క‌మెడియ‌న్‌, ప‌లు చిత్రాల్లో కామెడీతో మెప్పించిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్