Election Officials:ఎన్నికల వేళ బ్యాంకు మేనజర్లకు కీలక సూచనలు చేసిన ఎలక్షన్ అధికారులు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల వాతావరణం మొదలైన సంగతి తెలిసిందే. ఓ వైపు నేతల హోరాహోరి ప్రచారం.. మరోవైపు పోలీసుల తనిఖీలతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఎన్నికల అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో అనుమానిత నగదు లావాదేవీలపై అధికారులు నిఘా పెంచారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ కీలక సూచనలు చేశారు.
డిజిటల్ లావాదేవీలపై నిఘా ఉంచాలని ఆదేశాలు..
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బ్యాంకుల్లో జరిగే డిజిటల్ లావాదేవీల్లో లెక్కకు మించిన నగదు ఖాతాలపై నిఘా ఉంచాలని బ్యాంకు మేనేజర్లకు సూచించారు. అనుమానిత లావాదేవీల సమాచారాన్ని తమకు పంపించేలా ఎన్నికల అధికారులకు సహకరించాలని కోరారు. అలాగే ఏటీఎంల్లో నగదు డిపాజిట్ చేయడానికి వినియోగించే వాహనాలపై నిఘా పెట్టాలని తెలిపారు. ఈ వాహనాల మాటున డబ్బు తరలించే అవకాశం ఉందని బ్యాంకులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏటీఎంలో డబ్బు నింపే వాహనాలకు బ్యాంకులు తప్పనిసరిగా జీపీఎస్‌ను ఏర్పాటు చేసి ట్రాక్ చేయాలని సూచించారు. బ్యాంకు అధికారులు తరలిస్తున్న నగదుకు తప్పనిసరిగా డాక్యుమెంట్లు, క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని వివరించారు.
రూ.లక్షకు మించి లావాదేవీలు జరిగితే ఫిర్యాదు చేయాలి..
రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారి బంధువుల అకౌంట్ల నగదు లావాదేవీలను అందించాలని విజ్ఞప్తి చేశారు. వీరు రూ.లక్షకు మించిన నగదు లావాదేవీలు జరిపితే ఫిర్యాదు చేయాలన్నారు. తనిఖీల్లో పట్టుబడుతున్న నగదును సరైన పత్రాలు చూపించిన వారికి వెంటనే ఇచ్చేస్తున్నామని రొనాల్డ్ వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం హైదరాబాద్‌లోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్లతో కలిసి ఆయన పరిశీలించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com