పంజాబ్ ఎన్నికలు వాయిదా.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ..!!

  • IndiaGlitz, [Monday,January 17 2022]

మినీ ఎన్నికల సంగ్రామంగా చెబుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లోని అధికార పార్టీలు మరోసారి అధికారాన్ని అందుకోవాలని కృతనిశ్చయంతో వుండగా.. ప్రతిపక్షాలు మాత్రం ఈసారి సత్తా చాటాలని పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్ధుల కోసం వేట సాగిస్తున్నాయి.

అయితే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలక్షన్ తేదీని మార్చాలంటూ అధికార కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. పంజాబ్‌లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్‌ జరగాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 16న సిక్కులు అత్యంత పవిత్రంగా జరుపుకునే గురు రవిదాస్‌ జయంతి ఉంది. ఇందుకు సంబంధించిన ఉత్సవాలు సైతం ముందే ప్రారంభమవుతాయి.

దీనికి తోడు గురు రవిదాస్ జయంతి నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి వెళ్తారని పార్టీలు చెబుతున్నాయి. దీంతో ప్రజలు ఓటు వేసే అవకాశం కోల్పోతారని ఎన్నికల సంఘానికి తెలిపాయి. ఈ పరిస్థితులను దృష్టిలో వుంచుకుని పోలింగ్‌ తేదీని వారం పాటు వాయిదా వేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ఈసీని కోరారు. కాంగ్రెస్‌తో పాటు బీఎస్పీ, బీజేపీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తేదీ వాయిదాపై సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. 

More News

కరోనా బారిన పడిన రవితేజ హీరోయిన్.. డబుల్ డోస్ తీసుకున్నా వదలని కోవిడ్

దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,13,444 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,58,089 కేసులు వెలుగుచూశాయి.

బంగార్రాజు మొద‌టిరోజు వ‌సూళ్ళు 17.5 కోట్లు గ్రాస్: నాగార్జున

అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు సినిమా ఈ శుక్ర‌వార‌మే థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్

సికింద్రాబాద్ క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. భారీ ఆస్తినష్టం, బ్రిటీష్ వారి హయాంలో నిర్మాణం

సంక్రాంతి పండుగ వేళ సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్‌ క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.

అన్ని ఏరియాల్లో 'హీరో' కు సూప‌ర్ పాజిటివ్ రిపోర్ట్ వ‌చ్చింది: నిర్మాత గల్లా పద్మావతి

అశోక్ గల్లా. నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `హీరో. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు.

"నేను త్వరగా చనిపోవాలి, అందరికీ సంక్రాంతి విషెస్".. వర్మ వెరైటీ ట్వీట్

ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకు ప్రతిరోజూ ఎవరో ఒకరిని గిల్లకపోతే రామ్‌గోపాల్ వర్మకు నిద్రపట్టదు. కొందరు ఆయనకు పిచ్చి అంటారు.. ఇంకొందరు ఆయను జీనియస్ అంటారు.