Remote Voting:  సొంతూరికి దూరంగా వుంటున్నారా.. ఇకపై ఎక్కడున్నా ఓటు వేయొచ్చు, రిమోట్ ఓటింగ్‌పై ఈసీ ఫోకస్

  • IndiaGlitz, [Wednesday,June 08 2022]

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాము లాంటిది. అయినప్పటికీ ఎన్నో ఏళ్లుగా ఈ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తూ వస్తోంది. మారుతున్న కాలమాన పరిస్ధితులకు అనుగుణంగా కొన్ని సంస్కరణలు చేస్తోంది. ముఖ్యంగా విధి నిర్వహణ, ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో వున్న వారు తమ స్వస్థలాల్లో ఓట్లు వేయడం కుదరడం లేదు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడున్న సరే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.

పరిశీలనలో రిమోట్ ఓటింగ్:

దీనికి సంబంధించి రానున్న రోజుల్లో కమిటీ వేయనున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఇతర ప్రాంతాల్లో ఉండి తమ ఓటును కోల్పోతోన్న ఓటర్ల సమస్యలపై ఇందులో చర్చించనున్నారు. ఈ క్రమంలోనే రిమోట్ ఓటింగ్ విధానం సాధ్యాసాధ్యాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఒకవేళ రిమోట్ ఓటింగ్ ఆమోదించబడితే అది ఓటింగ్ శాతాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల ఇంటి నుంచి దూరంగా ఉండేవారు, ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనలేని వ్యక్తులు కూడా ఓటు వేసే వెసులుబాటు వుంటుంది. మరోవైపు.. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ ఎందుకు తక్కువగా నమోదవుతుందన్న అంశంపై ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖల్లో ఓటు వేసేందుకు వెళ్లేందుకు వీలుగా ఓటింగ్ రోజున సెలవు ప్రకటిస్తుంది. అయితే సెలవు తీసుకున్నా ఓటు వేయని ఉద్యోగులు భారీగా వున్నారు.

విదేశాల్లోని భారతీయుల కోసం పోస్టల్ బ్యాలెట్:

కాగా... దేశంలో ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కుంటూ లక్షలాది మంది బయటకు వెళ్తున్నారు. వీరిలో చాలా మంది ఎంపీ-ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు తమ గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ రిమోట్ ఓటింగ్ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఓటరు దేశంలోని ఏ పోలింగ్ స్టేషన్‌లోనైనా ఓటు వేయగలరు. దీనితో పాటు విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు పోస్టల్ బ్యాలెట్‌ను ప్రారంభించే అంశానికి సంబంధించిన ప్రతిపాదన కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనలో వుంది.

More News

RBI : షాకిచ్చిన ఆర్‌బీఐ.. మరోసారి రెపో రేటు పెంపు, ఈఎంఐలు ఇక భారమే..!!

భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది.

Narendra Modi: కొత్త నాణేలను విడుదల చేసిన మోడీ.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

2016 నవంబర్ 8న నోట్ల రద్దుతో కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ..

janasena: క్రియాశీలక సభ్యులకు బీమా పత్రాలు.. మూడు రోజులూ పండుగలా చేయండి: జనసైనికులకు పవన్ నిర్దేశం

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు బీమా పత్రాలు, సభ్యత్వ కిట్లను అందచేసే కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

Janasena: గుంటూరు నగర జనసేన పార్టీ కమిటీ నియామకం, 43 మందికి ఛాన్సిచ్చిన పవన్

వచ్చే ఎన్నికల నాటికి సంస్థాగతంగా పటిష్టం  కావాలని భావిస్తోన్న జనసేన పార్టీ ఆ దిశగా దృష్టి పెట్టింది.

రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ చిత్రానికి "మాటే మంత్రము" టైటిల్ ఖరారు

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమాకు "మాటే మంత్రము" అనే టైటిల్ ను ఖరారు చేశారు.