Chandrababu: చంద్రబాబుకు భారీ షాక్.. ఎన్నికల సంఘం నోటీసులు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల పోలింగ్‌కు మరో 40 రోజులు మాత్రమే ఉంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే హద్దులు దాటి మాట్లాడుతున్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రసంగాల్లో సీఎం జగన్ మీద వ్యక్తిగ విమర్శలు ఎక్కువయ్యాయి. దీంతో వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చింది. కోడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ చేసింది.
ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల ప్రజాగళం సభల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచార ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనాకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. కోడ్‌ను ఉల్లంఘిస్తూ జగన్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈమేరకు వైసీపీ ఎమ్మె్ల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు.. చంద్రబాబు జగన్‌ను ఉద్దేశించి ‘దొంగ, రాక్షసుడు, జంతువులు, హు కిల్డ్ బాబాయి’ వంటి వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
చంద్రబాబు చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్‌తో పాటు యూట్యూబ్ లింక్‌లు కూడా సీఈవోకి అందించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడడం నిబంధనలకు విరుద్ధమని.. రెచ్చగొట్టేలా, ఇతరులను కించపరిచేలా, వ్యక్తిగత విమర్శలు చేయడం నేరమని నోటీసుల్లో పేర్కొంది. 48 గంటల్లోగా దీనిపై స్పందించాలని ఆదేశించింది. మరి ఈ నోటీసులపై చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.
కాగా చంద్రబాబు ప్రజాగళం సభల్లో సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా 31 మంది వృద్ధురాళ్లను జగన్ చంపేశారని పోలీసులు లోపల వేయాలని వ్యాఖ్యానించారు. అలాగే బాబాయ్ చంపించిన హంతుకులకు మద్దతు చెబుతున్నారంటూ కూడా పదే పదే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రసంగాలపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతో ఏం మాట్లాడుతున్నారో బాబుకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments