Election Commission:ఓటర్ల జాబితా సవరణకు శ్రీకారం.. ఏ రోజున ఏం చేస్తారు, షెడ్యూల్ ఇదే..!!
- IndiaGlitz, [Sunday,June 11 2023]
సార్వత్రిక ఎన్నికలతో పాటు త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టేసింది. దీనిలో భాగంగా వార్షిక ఓటర్ల జాబితా సవరణ చేయాలని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారందరినీ ఓటర్లుగా చేర్చాలని ఆదేశించింది. తెలంగాణ , ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల సీఈవోలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల అధికారులు ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్తగా నమోదైన 18 నుంచి 19 ఏళ్ల ఓటర్లకు డిజిటల్ గుర్తింపు కార్డుల్ని పంపిణీ చేయనుంది. సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఇప్పటికే దృష్టి సారించాయి.
షెడ్యూల్ ఇదే :
జూన్ 20 వరకు మారిన విధానాలు, నిబంధనలపై ఈఆర్వో, ఏఈఆర్వో, బీఎల్వోలకు శిక్షణ
ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 29 వరకు పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, మౌలిక వసతుల కల్పనపై ఫోకస్
సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 10 వరకు ఫార్మాట్ 1 నుంచి 8 వరకు డ్రాఫ్ట్రోల్ రూపకల్పన
అక్టోబర్ 17 ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ
అక్టోబర్ 17 నుంచి నవంబర్ 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
డిసెంబర్ 26 లోపు ఫిర్యాదుల పరిష్కారం
2024 జనవరి 1న ఓటర్ల జాబితాల పరిశీలన
2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితాల ప్రచురణ