BRS : టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్

  • IndiaGlitz, [Friday,December 09 2022]

టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో మరో కీలక అధ్యాయం మొదలైంది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా ఆమోదిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఈసీ గురువారం లేఖ ద్వారా సమాచారం అందజేసింది. దీంతో రేపు మధ్యాహ్నం 1.20 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు కేసీఆర్. ఈసీ తనకు ఇచ్చిన లేఖకు ఆయన అధికారికంగా రిప్లయ్ ఇవ్వనున్నారు. అనంతరం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించనున్నారు కేసీఆర్. ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా పార్టీ జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఆహ్వానాలు అందాయి.

దసరా నాడు బీఆర్ఎస్ ప్రకటించిన కేసీఆర్:

జాతీయ రాజకీయాలే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీగా వున్న తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలని కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ ఏడాది అక్టోబర్ 5 దసరా నాడు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఆ రోజు పార్టీ సర్వ సభ్య సమావేశం నిర్వహించి ఈ మేరకు తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ నేతలు ఆ తీర్మానంపై సంతకాలు చేశారు.

ఇది టీఆర్ఎస్ ప్రస్థానం:

కాగా.. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్ జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా కేసీఆర్ పార్టీని స్థాపించారు. అప్పటికే తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన కేసీఆర్ .. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 14 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలకు , వ్యయ ప్రయాసలకు ఒర్చుకుని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. అనేక వినూత్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నారు.

More News

Harish Shankar-Theri Remake: నా చావుకు కారణం హరీశ్ శంకర్: పవన్ అభిమాని సూసైట్ నోట్ వైరల్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ , దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీపై ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

Aakrosham: మంచి ఎమోష‌న్స్, యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ‘ఆక్రోశం’ - నిర్మాత సి.హెచ్‌. స‌తీష్ కుమార్‌

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న అరుణ్ విజ‌య్ హీరోగా

Harish Shankar : ‘పంచ‌తంత్రం’ వంటి కంటెంట్ రిచ్ ఫిలింస్ గురించి ప‌ది మందికి చెప్పాలి - హ‌రీష్ శంక‌ర్‌

డా.బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న

Manchu Lakshmi: మోహన్ లాల్ తో ఏడాదికో సినిమా చేయాలని ఉంది - మంచు లక్ష్మి

మోహన్ లాల్ హీరోగా నటించిన ఫిల్మ్ మాన్ స్టర్. ఈ చిత్రంలో మంచు లక్ష్మి కీలక పాత్రను పోషించింది.

Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్ లో ధరల వివరాలివే..!!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. పాలవంటి తెల్లని మేయని ఛాయతో గ్రీకు రాకుమారుడిలా కనిపించే ఆయనంటే చిన్నారుల