ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్న ఎక్కడికి పోతావు చిన్నవాడా టీజర్..!
Saturday, October 15, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
స్వామి రారా, కార్తికేయ, సూర్య వెర్సెస్ సూర్య చిత్రాలతో వరుసగా విజయాలు సాధించిన నిఖిల్ నటించిన తాజా చిత్రం ఎక్కడికిపోతావు చిన్నివాడా. ఈ చిత్రంలో నిఖిల్ సరసన కుమారి 21 ఎఫ్ ఫేమ్ హెబ్బా పటేల్ నటించింది.
టైగర్ ఫేమ్ వి.ఐ.ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మేఘన ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందిన ఎక్కడికిపోతావు చిన్నవాడా టీజర్ రిలీజ్ చేసారు. మరణం దేహానికే కానీ ఆత్మకు కాదు అని భగవద్గీత చెబుతుంది. మరణించిన తర్వాత శారీరం బరువు 21 గ్రాములు తగ్గుతుంది...అని చెప్పడంతో ఈ టీజర్ ఇంట్రస్ట్ కలిగిస్తుంది. ప్రేమ, సంతోషం, పగ, బాధ...అంశాలతో రూపొందిన ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్రాన్ని నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంట్రస్టింగ్ గా ఉన్న ఈ టీజర్ చూస్తుంటే...నిఖిల్ కి మరో విజయం ఖాయం అనిపిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments