ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ - చిత్రయూనిట్
Send us your feedback to audioarticles@vaarta.com
స్వామిరారా, కార్తికేయ, సూర్య vs సూర్య లాంటి వైవిధ్యమైన కథాంశాలతో సరికొత్త కథనాలతో వరుస సూపర్‌హిట్ చిత్రాలతో టాలీవుడ్ ట్రేండ్ ని మార్చిన యంగ్ఎనర్జిటిక్ హీరో నిఖిల్, 21F ఫేం హెబాపటేల్, తమిళం లో అట్టకత్తి, ముందాసిపత్తి, ఎధిర్ నీచల్ ఫేం నందిత స్వేత ల కాంబినేషన్ లో టైగర్ ఫేం వి.ఐ.ఆనంద్ దర్శకుడిగా మేఘన ఆర్ట్స్ నిర్మాణంలో మేఘన ఆర్ట్స్ బ్యానర్ లో ఢిఫరెంట్ లవ్ స్టోరి ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 80% షూటింగ్ ని పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే టైటిల్ ఎనౌన్స్‌చేసిన దగ్గరనుండి ఇప్పటివరకూ చాలా మంచి పాజిటివ్ బజ్ రావటం యూనిట్ అంతా ఆనందంతో వున్నారు.
ఈ సంధర్బమ్ గా నిర్మాతలు మాట్లాడుతూ.. మా మేఘన ఆర్ట్స్ బ్యానర్ లో నిఖిల్ హీరోగా , హెబాపటేల్, నందిత శ్వేత ల కాంబినేషన్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న చిత్రానికి ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే టైటిల్ ని చెప్పగానే తెలుగు ప్రేక్షకుల చేత అనూహ్యమైన రెస్పాన్స్ రావటంతో మా చిత్ర యూనిట్ అంతా ఆనందంగా వున్నాము. మా దర్శకుడు ఆనంద్ చాలా కొత్త గా ఆలోచిస్తారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మా హీరో నిఖిల్ భర్తడే కి గిఫ్ట్ గా ఇచ్చారు మా యూనిట్ అంతా.. ట్రెండ్ లో వుంటూనే ఎంటర్‌టైనింగ్ చేయటంలో మా హీరో నిఖిల్, దర్శకడు ఆనంద్ సిద్ధహస్తులే. విడుదల చేసిన ప్రీ టీజర్ పోస్టర్ కి , ఫస్ట్ లుక్ కి అటు వెబ్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో వైరల్ గా ట్రెండింగ్ అవ్వటం చాలా హ్యపిగా వుంది. త్వరలో శేఖర్ చంద్ర అందించిన ఆడియో ని విడదల చేసి చిత్రాన్ని అగష్టు లో విడుదల చేయాటానికి సన్నాహలు చేస్తున్నాము. అని అన్నారు
నిఖిల్, హెబాపటేల్, నందిత శ్వేత(పరిచయం), వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, సత్య, తాగుబోతు రమేష్, జోష్ రవి, వైవా హర్ష, సుదర్శన్, భద్రమ్, అపూర్వ శ్రీనివాస్ మెదలగు వారు నటించగా..
పాటల- రామజోగయ్య శాస్ట్రి, శ్రీమణి, ఆర్ట్- రామాంజనేయులు, ఎడిటర్- చోటా.కె.ప్రసాద్, సంగీతం-శేఖర్ చంద్ర, మాటలు- అబ్బూరి రవి, డి.ఓ.పి- సాయి శ్రీరామ్, నిర్మాత- మేఘన ఆర్ట్స్ , స్టోరి, స్క్రీన్‌ప్లే,డైరక్టర్- వి.ఐ.ఆనంద్,
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments