'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సెన్సార్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
స్వామిరారా', 'కార్తికేయ', 'సూర్య vs సూర్య' లాంటి వైవిధ్యమైన కథాంశాలతో సరికొత్త కథనాలతో వరుసగా హ్యాట్రిక్ సూపర్‌హిట్ చిత్రాలతో యూత్‌లో యంగ్ఎనర్జిటిక్ స్టార్ గా ఎదిగిన హీరో నిఖిల్ మరో వినూత్నమైన కథాంశంతో మేఘన ఆర్ట్స్ బ్యానర్‌పై వస్తున్న చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. ఈచిత్రంలో నిఖిల్ కి జంటగా 21F ఫేమ్ హేబాపటేల్ మరియు తమిళం లో 'అట్టకత్తి', 'ముందాసిపత్తి', 'ఎధిర్ నీచల్' లాంటి వరస సూపర్‌హిట్స్ లో నిటించిన నందిత శ్వేత లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని 'టైగర్' ఫేం వి.ఐ.ఆనంద్ దర్శకుడిగా తెరకెక్కించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను నవంబర్ 11న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ పూర్తి కావడంతో సినిమా నవంబర్ 11న విడుదల ప్రేక్షకుల ముందు రావడానికి రూట్ క్లియర్ అయినట్లే...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments