'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Thursday,November 03 2016]

స్వామిరారా', 'కార్తికేయ‌', 'సూర్య vs సూర్య' లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుసగా హ్యాట్రిక్‌ సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో యూత్‌లో యంగ్ఎన‌ర్జిటిక్ స్టార్ గా ఎదిగిన హీరో నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై వ‌స్తున్న చిత్రం 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'. ఈచిత్రంలో నిఖిల్ కి జంట‌గా 21F ఫేమ్ హేబాప‌టేల్ మ‌రియు త‌మిళం లో 'అట్ట‌క‌త్తి', 'ముందాసిప‌త్తి', 'ఎధిర్ నీచ‌ల్' లాంటి వ‌ర‌స సూప‌ర్‌హిట్స్ లో నిటించిన నందిత శ్వేత‌ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని 'టైగ‌ర్' ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కించారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను న‌వంబ‌ర్ 11న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. తాజాగా సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్ పొందింది. సెన్సార్ పూర్తి కావ‌డంతో సినిమా న‌వంబ‌ర్ 11న విడుద‌ల ప్రేక్ష‌కుల ముందు రావ‌డానికి రూట్ క్లియ‌ర్ అయిన‌ట్లే...

More News

ఈ నెల 4న విడుదలవుతోన్న 'ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు'

విజెవైఎస్ఆర్ ఆర్ట్స్ పతాకంపై వై.శేషిరెడ్డి సమర్పణలో రవి దర్శకత్వంలో తమిళంలో ఘనవిజయం సాధించిన

'ధర్మయోగి' చిత్రం పైరసీ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం - నిర్మాత సి.హెచ్.సతీష్ కుమార్

ధనుష్ హీరోగా ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో 'కొడి'చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సి.హెచ్.సతీష్ కుమార్ 'ధర్మయోగి'

డబ్బింగ్ కార్యక్రమాల్లో మాస్ హీరో విశాల్ 'ఒక్కడొచ్చాడు'

మాస్ హీరో విశాల్-తమన్నా కాంబినేషన్ లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సెన్సార్ పూర్తి

పృథ్వీ,నవీన్ చంద్ర హీరోలుగా,సలోని,శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన హిలేరియస్ ఎంటర్ టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'.ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది.

రామ్ చరణ్ హీరోయిన్ గా....

మెగాపవర్ స్టార్ రామ్చరణ్ ఇప్పుడు ధృవ సినిమా పాటల చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.