నవంబర్ 11న ఎక్కడికి పోతావు చిన్నవాడా విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
స్వామిరారా, కార్తికేయ, సూర్య వెర్సెస్ సూర్య' లాంటి వైవిధ్యమైన కథాంశాలతో విజయం సాధించి యూత్‌లో యంగ్ఎనర్జిటిక్ స్టార్ గా ఎదిగిన హీరో నిఖిల్ మరో వినూత్నమైన కథాంశంతో వస్తున్న చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా. ఈచిత్రంలో నిఖిల్ కి జంటగా 21 ఎఫ్ ఫేం హెబాపటేల్ మరియు తమిళం లో అట్టకత్తి, ముందాసిపత్తి, ఎధిర్ నీచల్ తదితర సూపర్‌హిట్స్ లో నటించిన నందిత స్వేత లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ క్రేజి ప్రోజెక్ట్ ని టైగర్ ఫేం వి.ఐ.ఆనంద్ తెరకెక్కించారు. మేఘన ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందిస్తున్న ఈచిత్రానికి సంబందించిన మెదటి లుక్ టీజర్ ని ఈనెల 15న చిత్ర యూనిట్ హీరో నిఖిల్, హీరోయిన్ నందిత శ్వేత, దర్శకుడు వి.ఐ.ఆనంద్ లు రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని నవంబర్ 11 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చెప్పారు.
ఈ సంధర్బంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ...మేఘన ఆర్ట్స్ బ్యానర్ లో ఢిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాన్ని చేశాం. దాదాపు 8 నెలల నుండి షూటింగ్ కార్యక్రమాలు చేశాం. షూటింగ్ కంప్లీట్ అయ్యాకనే ప్రమోషన్ స్టార్ట్ చేద్దామని యూనిట్ అంతా అనుకున్నాం
ఇప్పడు మా టీజర్ ని ఎటువంటి ఆడంబరాం లేకుండా విడుదల చేశాం. చూసిని ప్రతి ఓక్కరూ చాలా ఇంట్రస్టింగ్ గా వుందని చెప్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వటం చాలా ఆనందంగా వుంది. నవంబర్ 11న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఈనెల చివరివారంలో లేదా నవంబర్ మెదటివారంలో శేఖర్ చంద్ర అందించిన ఆడియో విడుదల చేస్తాం. ఈ చిత్రంలో ఆద్యంతం నవ్వించమే కాకుండా సూపర్ థ్రిల్ వుంటుంది. హెబాపటేల్ , నందితా శ్వేత ఎక్సలెంట్ గా నటించారు. ఇంకా వెన్నెల కిషోర్ చాలా బాగా నవ్వించాడు. నా గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా అందరిని ఆకట్టుకుంటుంది అన్నారు.
హీరోయిన్ నందిత శ్వేత మాట్లాడుతూ...నేను కన్నడ హీరోయిన్ ని ప్రస్తుతం తమిళ చిత్రాలు చేస్తున్నాను. నేను నటించిన అన్ని చిత్రాలు సూపర్‌హిట్స్ కావటం నా లక్. అలాగే నేను డెబ్యూగా నటించిన చిత్రాలు బ్లాక్‌బస్టర్ గా నిలిచాయి. తెలుగు డెబ్యూ చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా కూడా అలాగే పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాను. నిఖిల్ తో నటించటం చాలా కంఫర్ట్ గా వుంది. ఆనంద్ గారి డైరక్షన్ సూపర్, ప్రోడ్యూసర్ గారికి నా ధన్యవాదాలు అని అన్నారు.
దర్శకుడు వి.ఐ.ఆనంద్ మాట్లాడూతూ" ఎక్కడికి పోతావు చిన్నివాడా చిత్రానికి సంభందించి ప్రతి విషయాన్ని మీడియా వారు చాలా పాజిటివ్ గా తీసుకువెళ్ళారు. ఈ టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నవంబర్ 11న విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాం అన్నారు.
నిఖిల్, హెబాపటేల్, నందిత శ్వేత, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, సత్య, తాగుబోతు రమేష్, జోష్ రవి, వైవా హర్ష, సుదర్శన్, భద్రమ్, అపూర్వ శ్రీనివాస్ మెదలగు వారు నటించిన ఈ చిత్రానికి పాటలు - రామజోగయ్య శాస్ట్రి, శ్రీమణి, ఆర్ట్- రామాంజనేయులు, ఎడిటర్- టా.కె.ప్రసాద్, సంగీతం-శేఖర్ చంద్ర, మాటలు- అబ్బూరి రవి, పి.ఆర్.ఓ- ఎస్.కె.ఎన్, ఏలూరుశీను, డి.ఓ.పి- సాయి శ్రీరామ్, నిర్మాత- మేఘన ఆర్ట్స్, స్టోరి, స్క్రీన్‌ప్లే,డైరక్టర్- వి.ఐ.ఆనంద్,
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments