పీటల మీద పెళ్లి ఆగిపోతే.. ఫ్రస్ట్రేషన్ లో 'ఏక్ మినీ కథ' హీరో!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం యువ హీరో సంతోష్ శోభన్ పేరు బాగా వినిపిస్తోంది. బోల్డ్ అండ్ డిఫెరెంట్ కంటెంట్ 'ఏక్ మినీ కథ'తో మాయ చేశాడు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇదే ఉత్సాహంతో మరిన్ని చిత్రాలకు ఈ యంగ్ హీరో రెడీ అవుతున్నాడు.
ఇదీ చదవండి: తొలిసారి తన కొడుకు ఫోటో షేర్ చేసిన శ్రేయ ఘోషల్.. పేరు ఏంటంటే!
ఫన్ ఎలిమెంట్స్ ఉండే విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. తాజాగా సంతోష్ శోభన్ నుంచి మరో ఆసక్తికర ప్రకటన వచ్చింది. సంతోష్ నటిస్తున్న తదుపరి చిత్ర విశేషాలు, టైటిల్ ప్రకటించారు. సంతోష్ నెక్స్ట్ మూవీ టైటిల్ 'ప్రేమ్ కుమార్'. సారంగ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శివప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డెబ్యూ దర్శకుడు అభిషేక్ మహర్షి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం విశేషం.
ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి కాగా మిగిలిన షూటింగ్ ని కరోనా కేసులు తగ్గాక పూర్తి చేసి విడుదల చేయనున్నారు. కథలోని ఆసక్తికర విషయాన్ని కూడా చిత్ర యూనిట్ తెలియజేసింది. తెలుగు సినిమాల్లో హీరో చివర్లో వచ్చి ఎమోషనల్ గా స్పీచ్ ఇవ్వడం, పీటలపై ఉన్న హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. కానీ అదే పీటలపై ఉన్న పెళ్లి కొడుకుని మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఈ పాయింట్ తోనే ఫన్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు.
అలాంటి ఓ పెళ్లి కొడుకుగా సంతోష్ నటిస్తున్నాడు. తనకు పెళ్లి కావడం లేదనే ఫ్రస్ట్రేషన్ లో అతడు ఏం చేశాడనేదే ఈ చిత్ర కథ అని చిత్ర యూనిట్ తెలిపింది. యంగ్ బ్యూటీ రాశి సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇంతకు ముందు ఈ బ్యూటీ 'శశి' చిత్రంలో మెరిసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com