రవితేజతో ఎనిమిదేళ్ల తరువాత..
Send us your feedback to audioarticles@vaarta.com
హాస్యనటుడిగా కెరీర్‌ని ప్రారంభించిన బండ్ల గణేష్.. ఆ తరువాత సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్, బాద్‌షా, టెంపర్ చిత్రాలతో విజయాలను అందుకున్న గణేష్.. గత కొంత కాలంగా బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉండి నిర్మాణానికి దూరంగా ఉన్నారు. అయితే అతి త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ని ఆయన నిర్మించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎనిమిదేళ్ల క్రితం నిర్మాతగా తను నిర్మించిన తొలి చిత్రం ఆంజనేయులులో కథానాయకుడిగా నటించిన రవితేజనే ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు కూడా ఇదివరకు గణేష్ నిర్మించిన చిత్రానికి పనిచేసినవాడేనని కూడా కథనాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడతాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments