రెండు వారాలు..ఎనిమిది సినిమాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
దసరాకి రెండు పెద్ద సినిమాలు పోటాపోటీగా విడుదలవుతుండడంతో.. ఆ సీజన్‌కి ముందు వారాలలో.. లో బడ్జెట్, మీడియం బడ్జెట్ సినిమాల హడావుడి ఎక్కువైపోయింది. ఈ వారంలో అంటే సెప్టెంబర్ 8న మూడు చిత్రాలు విడుదల కానుంటే.. వచ్చే వారం ఐదు సినిమాలు సందడి చేయనున్నాయి. సెప్టెంబర్ 8న నాగచైతన్య 'యుద్ధం శరణం', అల్లరి నరేష్ 'మేడమీద అబ్బాయి', సచిన్ జోషి 'వీడెవడు' విడుదల కానుంటే..సెప్టెంబర్ 15న సునీల్ 'ఉంగరాల రాంబాబు', సందీప్ కిషన్ 'ప్రాజెక్ట్ z', విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన 'శ్రీవల్లి', కొత్త తారలతో రూపొందిన 'ఓయ్.. నిన్నే', 'ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం' చిత్రాలు రిలీజ్ కానున్నాయి.
ఇవన్నీ స్ట్రయిట్ సినిమాలు కాగా.. వీటితో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇటీవల కాలంలో చిన్న సినిమాలు బాగానే సక్సెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిలో ఏ చిత్రాలు విజయం సాధిస్తాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com