ఇగోయిస్ట్ చైతు...
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి సవ్యసాచి ఆల్రెడీ చిత్రీకరణ దశలో ఉంది. ఇక మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలు జరిగాయి. తర్వలోనే రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. `శైలజా రెడ్డి అల్లుడు` అనే టైటిల్ దీనికి ప్రచారంలో ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చైతన్య ఇగో ఉన్న యువకుడి పాత్రలో కనపడతాడట. అత్త పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుండగా, అను ఇమాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తుంది. `భలే భలే మగాడివోయ్`, `మహానుభావుడు` వంటి చిత్రాల్లో హీరోల డిజార్డర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించిన దర్శకుడు మారుతి ఇగోయిస్ట్ క్యారెక్టర్‌ను ఎలా చూపించబోతున్నాడనేది ఆసక్తిని రేపుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments