'ఇగో' ఆడియో విడుదల
- IndiaGlitz, [Saturday,December 23 2017]
"ఆకతాయి" ఫేమ్ ఆశిష్ రాజ్, సిమ్రాన్ జంటగా రూపొందుతోన్న సినిమా "ఇగో". సుబ్రమణ్యం దర్శకత్వంలో విజయ్ కరణ్–కౌసల్ కరణ్–అనిల్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక నిన్న సాయంత్రం హైద్రాబాద్ అత్యంత ఘనంగా జరిగింది.ఈ వేడుకలో 30 ఇయర్స్ పృధ్వీ, తమ్మారెడ్డి భరద్వాజ, త్రినాధరావు నక్కిన తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బిగ్ సీడీని విడుదల చేసిన అనంతరం ఆడియోను ఆవిష్కరించి మొదటి సీడీని త్రినాధరావు నక్కినకు అందించారు.
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. "ముగ్గురు నిర్మాతలు త్రిమూర్తుల్లా మారి వరుస సినిమాలు ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా డిసిప్లైన్ ఉన్న నిర్మాతలు వారు. వారికోసమే ఆడియో వేడుకకి వచ్చి మూడు గంటలు కూర్చున్నాను. ఆశిష్ చాలా ఎనర్జీటిక్ గా నటిస్తున్నాడు. సాయికార్తీక్ స్పీడ్ చూస్తుంటే.. అతిత్వరలో 100 సినిమాలు చేసేలా ఉన్నాడు. సుబ్రమణ్యం నిబద్ధత కలిగిన దర్శకుడు.. "ఇగో" సినిమాతో అతడు మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను" అన్నారు.
ట్రైలర్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకులు త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ.. "ఈమధ్యకాలంలో క్యారెక్టరైజేషన్ ను బేస్ చేసుకొని తీస్తున్న సినిమాలు మంచి హిట్ అవుతున్నాయి. "ఇగో" కూడా ఆ తరహా సినిమానే. సాయికార్తీక్ స్టూడియో పెట్టుకొని ట్యూన్స్ చేస్తున్నప్పట్నుంచి నాకు పరిచయం. కాగా దర్శకుడు సుబ్రమణ్యం నాకు నా ఫస్ట్ సినిమా రిలీజ్ టైమ్ నుంచి తెలుసు, మంచి పనితనమున్న దర్శకుడు మాత్రమే కాదు మా అనకాపల్లి కుర్రాడు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను. కథానాయకుడు ఆశిష్ రాజ్ మొదటి సినిమా "ఆకతాయి"తో పోల్చి చూస్తే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. సినిమా మంచి హిట్ అయ్యి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకొంటున్నాను" అన్నారు.
చిత్ర దర్శకుడు సుబ్రమణ్యం మాట్లాడుతూ.. "సాయికార్తీక్ తో వర్క్ చేయడం ఇదే మొదటిసారి. ఆయన్ని ఎక్కువగా విసిగించేసేవాడ్ని.. చాలా అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చారు. హీరోహీరోయిన్లు ఆశిష్ రాజ్-సిమ్రాన్ సహజమైన నటనతో అలరించారు. మా టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి మంచి ఔట్ పుట్ ఇచ్చారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన త్రినాధరావు నక్కినగారికి ఋణపడి ఉంటాను" అన్నారు.
దీక్షా పంత్ మాట్లాడుతూ.. "బిగ్ బాస్" తర్వాత నేను నటించిన సినిమా "ఇగో". చాలా స్పెషల్ రోల్ ప్లే చేశాను. నిర్మాతలు కుటుంబ సభ్యుల్లా మెలిగేవారు. ఆశిష్ చాలా టాలెంటెడ్, అతడు హీరోగా ఎదగాలని కోరుకొంటున్నాను" అన్నారు.
హీరోహీరోయిన్లు ఆశిష్ రాజ్-సిమ్రాన్ లు తమకు ఈ సినిమాలో నటించే అవకాశం లభించడం పట్ల, దర్శకుడు సుబ్రమణ్యం సినిమాని తెరకెక్కించిన విధానం పట్ల సంతోషం వ్యక్తం చేసి.. సినిమా సూపర్ హిట్ అవ్వాలని అభిలషించారు.
చిత్ర నిర్మాణానికి సహకరించడంతోపాటు.. ఆడియో విడుదల వేడుకను విచ్చేసిన ప్రతి ఒక్కటికీ నిర్మాతలు విజయ్ కరణ్–కౌసల్ కరణ్–అనిల్ కరణ్ కృతజ్నతలు తెలిపారు.
దీక్షాపంత్, రావు రమేశ్, పోసాని, పృధ్వి, గౌతంరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ప్రసాద్ జి.కె