వ‌రుణ్ సినిమా పై ఎఫెక్ట్‌

  • IndiaGlitz, [Tuesday,December 11 2018]

నంద‌మూరి బాల‌కృష్ణ ఎవ‌రో త‌న‌కు తెలియ‌దంటూ.. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు చెప్పి అంద‌రినీ షాక్‌కి గురి చేశాడు. త‌ర్వాత పాత త‌రం న‌టుడు బాల‌య్య త‌న‌కు తెలుసున‌ని, మంచి క‌మెడియ‌న్ అని కూడా కామెంట్స్ విసిరాడు. దాంతో నంద‌మూరి అభిమానులు ఒక్క‌సారిగా నాగ‌బాబుపై సోష‌ల్ మీడియాలో విరుచుకుప‌డ్డారు.

ఇదంతా ఓకే అయితే ఇప్పుడు నంద‌మూరి అభిమానుల క‌న్ను.. నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ న‌టించిన 'అంత‌రిక్షం' సినిమాపై ప‌డింది. ఈ నెల 21న విడుద‌ల‌వుతున్న 'అంత‌రిక్షం' సినిమాను విడుద‌ల కాకుండా చూస్తామ‌ని ద‌మ్ముంటే త‌మ‌ను ఆపాల‌ని సోష‌ల్ మీడియాలో స‌వాళ్లు విసురుతున్నారు.

ఒక‌వేళ సినిమా విడుద‌లైనా.. నెగిటివ్ టాక్‌తో సినిమాను దెబ్బ తీయ‌డానికి నంద‌మూరి సోష‌ల్ మీడియా అభిమానులు సిద్ధంగా ఉన్నారన‌డంలో సందేహం లేదు. నాగ‌బాబును ఇప్పుడు ఏమీ అన‌ద‌లుచుకోవ‌డం లేదు. అంత‌రిక్షం సినిమా వ‌స్తుందిగా అప్పుడు చూసుకుందాం అని కొంద‌రు కామెంట్స్ పెడుతున్నారు. ఇది అంత‌రిక్షం సినిమాకు సంబంధం లేని స‌మ‌స్య‌. మ‌రి దీన్ని యూనిట్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.