ఎన్టీఆర్ చిత్రంలో ఈషా పాత్ర ఏంటంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `అరవింద సమేత`..` వీర రాఘవ` ట్యాగ్ లైన్. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం అక్టోబర్ 11న భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా ఈ చిత్రంలో ఈషా రెబ్బా కూడా నటిస్తుంది.
అయితే ఇందులో ఎన్టీఆర్ డబుల్ రోల్ అని.. అందులో ఒకరి జోడిగా ఈషా కనిపిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదట. ఎన్టీఆర్ ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ చేయరట. అంతే కాకుండా ఎన్టీఆర్ చెల్లెలి పాత్రలో ఈషా రెబ్బా కనిపిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. రెండు రోజులు ఆగితే.. ఈ సస్పెన్స్‌కు తెరపడుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments