`లస్ట్ స్టోరీస్`లో ఆమె పాత్రను చూసి షాకవుతారట
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్ ఈషా రెబ్బా ఈ శుక్రవారం `రాగల 24 గంటల్లో` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాగా.. ఈమె తెలుగులో కొన్ని కథల సంపుటిగా `లస్ట్ స్టోరీస్` అనే వెబ్ సిరీస్ రూపొందింది. ఇందులో ఈషా పాత్ర చాలా బోల్డ్‌గా, రొమాంటిక్‌గా ఉంటుందట.
రోనీ స్క్రూనీవాలా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను నలుగురు దర్శకులు నాలుగు భాగాలుగా చిత్రీకరించనున్నారట. అందులో ఈషారెబ్బా నటించిన భాగాన్ని ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కించాడు. ఇప్పటికే నందిని రెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు, అమలాపాల్ ప్రధాన పాత్రధారులుగా నటించిన భాగాన్ని తెరకెక్కించారు.
మూడో పార్ట్‌ని తరుణ్ భాస్కర్ చిత్రీకరించాల్సి ఉంది. ఇది కాకుండా సందీప్ వంగా చేయాల్సిన నాలుగో భాగాన్ని ఆయన డైరెక్ట్ చేయడం లేదట. ఆయన ఈ వెబ్‌సిరీస్ నుండి తప్పుకుంటున్నట్లు తెలిపారు. మరిప్పుడు నాలుగో భాగాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అంతా పూర్తయిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. ఇలాంటి వెబ్‌సిరీస్‌ను తెలుగులో తెరకెక్కించడమంటే సాహసం చేస్తున్నట్లే మరి తెలుగు ప్రేక్షకులు ఈ తెలుగు లస్ట్ స్టోరీస్‌ను ఎలా ఆదరిస్తారో వేచి చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments